Bogatha Waterfalls: బొగత జలపాతాలకు నో ఎంట్రీ.! ఎవరూ రావద్దని ఆంక్షలు..

|

Jul 27, 2024 | 7:06 PM

తెలంగాణ నయాగర బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు పడింది.. ఒకవైపు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. మరోవైపు సందర్శకులు అత్యుత్సాహంతో ప్రమాదాలు బారిన పడుతున్నారు.. విహార యాత్రలు విషాదంతం అవుతుండడంతో తాత్కాలికంగా మూసివేశారు. ములుగు జిల్లాలోని బొగత జలపాతాల వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉదృతంగా ప్రవహిస్తున్న జలపాతాల వద్ద వరదల్లో చిక్కుకొని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.

తెలంగాణ నయాగర బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు పడింది.. ఒకవైపు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి… మరోవైపు సందర్శకులు అత్యుత్సాహంతో ప్రమాదాలు బారిన పడుతున్నారు.. విహార యాత్రలు విషాదంతం అవుతుండడంతో తాత్కాలికంగా మూసివేశారు. ములుగు జిల్లాలోని బొగత జలపాతాల వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉదృతంగా ప్రవహిస్తున్న జలపాతాల వద్ద వరదల్లో చిక్కుకొని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మొత్తం ముగ్గురు వరదల్లో కొట్టుకుపోతుండగా సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరిని ప్రాణాలతో కాపాడారు. తోటి స్నేహితులతో కలసి విహారయాత్రకు వచ్చిన ఆ యువకుడు మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు..

జలపాతాల వద్ద ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరి నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి తీసుకుంటోంది. మృతిచెందిన యువకుడు వరంగల్ లోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన జస్వంత్ గా గుర్తించారు. ఏడుగురు స్నేహితులు కలిసి సరదాగా బొగత జలపాతాల సందర్శనకు వెళ్లారు. జలపాతాలు వీక్షించిన అనంతరం అక్కడ ఫోటోలు దిగారు.. అనంతరం జలపాతాల వరద లోతు గమనించకుండా ముగ్గురు యువకులు స్నానాలు చేయడానికి అందులోకి దూకారు..వరదల్లో చిక్కుకున్న ముగ్గురిలో జశ్వంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు..అంతా చూస్తుండగానే కళ్ళముందే ఈ ప్రమాదం జరగడంతో వారంతా షాక్ అయ్యారు. ముగ్గురు యువకులు వరదల్లో కొట్టుకుపోతుంటే గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఇద్దరి ప్రాణాలు కాపాడారు.. కానీ అప్పటికే జస్వంత్ ప్రాణాలు కోల్పోయాడు.. వాటర్ ఫాల్స్ నుండి డెడ్ బాడీని బయటకు తీసి వెంకటాపురం ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఐతే జలపాతాలు అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్నందువల్ల అటవీశాఖ అధికారులు సందర్శనను తాత్కాలికంగా రద్దు చేశారు. వరద ఉధృతి తగ్గేవరకు ఎవరూ రావద్దని ఆంక్షలు విధించారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jul 27, 2024 07:06 PM