Man vs Snake: తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
తాగితే మందుబాబుల ధైర్యం ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.. మందు తాగితే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది.. తాము ఏం చేస్తున్నామో?.. ఎవరితో పెట్టుకుంటున్నామో అని కూడా ఒక్కోసారి వారికి అర్థం కావడం లేదు. ఓ వ్యక్తి.. ఫుల్లుగా తాగి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడే ఓ పాము మందుబాబు కంటపడింది.. ఇంకేముంది గంటసేపు దాన్ని మందు బాబు ఆట ఆడుకున్నాడు. చూసి..చూసి ఆ మందుబాబును కాటేసింది ఆ పాము.
తాగితే మందుబాబుల ధైర్యం ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.. మందు తాగితే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది.. తాము ఏం చేస్తున్నామో?.. ఎవరితో పెట్టుకుంటున్నామో అని కూడా ఒక్కోసారి వారికి అర్థం కావడం లేదు. ఓ వ్యక్తి.. ఫుల్లుగా తాగి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడే ఓ పాము మందుబాబు కంటపడింది.. ఇంకేముంది గంటసేపు దాన్ని మందు బాబు ఆట ఆడుకున్నాడు. చూసి.. చూసి ఆ మందుబాబును కాటేసింది ఆ పాము. కదిరిలో మద్యం మత్తులో నడిరోడ్డుపై నాగరాజు అనే యువకుడు పాముతో హల్ చల్ చేశాడు.. దాదాపు గంటసేపు కదిరి- అనంతపురం ప్రధాన రహదారిపై పాముతో నాగరాజు పరాచకాలు ఆడాడు.. కాలితో తన్నుతూ.. చేతితో కొడుతూ పామును నానారకాలుగా చిత్రహింసలు గురిచేశాడు. పామును మెడలో వేసుకుని రోడ్డుపై తిరుగుతున్న నాగరాజును చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దాని మానాన అది చెట్ల పొదల్లోకి వెళుతున్నా.. తాగిన మైకంలో నాగరాజు దాన్ని వదిలిపెట్టలేదు. ఆ పాముతోనే పెట్టుకున్నాడు.
చుట్టుపక్కల వారు ఎంత వారించినా.. మద్యం మత్తులో ఉన్న నాగరాజు వారి మాటలను పట్టించుకోకుండా పాముతో చెలగాటమాడాడు. దాదాపు గంటసేపు పాము.. మందుబాబు పిచ్చి చేష్టలను స్థానికులు తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఎంత చెప్పినా పామును వదలలేదు. చివరకు పాము మనోడి చేష్టలతో విసుగు చెందినట్లు ఉంది. తన ముందు ఆటలాడుతున్న నాగరాజును ఒక్కసారిగా కాటేసింది. అంతే మనోడు అప్పటికి గాని.. ఆ పామును వదిలిపెట్టలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాగరాజు గతంలోనూ అనేకసార్లు మద్యం మత్తులో ఇలాగే పాములను పట్టుకొని మెడలో వేసుకుని… రోడ్డుపై తిరుగుతూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడం… డబ్బులు ఇవ్వమని బెదిరించడం చేశాడని స్థానికులు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.