Real Big Foot: షూ సైజు 23.. ఎప్పుడైనా విన్నారా.? ఎక్కడైనా చూసారా.?
పద్నాలుగేళ్ల పిల్లాడి చెప్పుల సైజు ఎంతుంటుంది.. మహాఅయితే 5 లేదా 6 ఉంటుంది. ఐతే అమెరికాలోని ఈ పిల్లాడి పాదం సైజు మాత్రం ఏకంగా 23 ఉంది. దీంతో బూట్లు కొనడానికి ప్రపంచమంతా గాలిస్తోంది ఈ 14 ఏళ్ల బాలుడి తల్లి.
పద్నాలుగేళ్ల పిల్లాడి చెప్పుల సైజు ఎంతుంటుంది.. మహాఅయితే 5 లేదా 6 ఉంటుంది. ఐతే అమెరికాలోని ఈ పిల్లాడి పాదం సైజు మాత్రం ఏకంగా 23 ఉంది. దీంతో బూట్లు కొనడానికి ప్రపంచమంతా గాలిస్తోంది ఈ 14 ఏళ్ల బాలుడి తల్లి.అమెరికాలో మిచిగన్‌కి చెందిన 14 ఏళ్ల ఎరిక్ కిల్‌బర్న్ జూనియర్ అనే పిల్లాడి పాదాలకు సరిపోయే బూట్లు దొరక్కపోవడంతో 22 సైజున్న బూట్లు ధరించాడు. ఐతే 23 ఇంచుల పాదాలకు కేవలం 22 ఇంచుల బూట్లు ధరించడంతో రెండు కాళ్లకు బొబ్బలు, గాయాలయ్యాయి. దీంతో ఇతర పిల్లలతో ఆడుకోలేక ఇబ్బందిపడిపోతున్నాడు. తల్లి రెబకా కొడుకు ఎరిక్‌కు బూట్లు కొనడానికి తిరగని షాపు లేదు. వామనుడిలా ఎదుగుతున్న పిల్లాడి ఎత్తు 6 అడుగుల 10 అంగుళాలు. చివరికి బూట్లు తయారు చేసే కంపెనీలను కూడా వేడుకుంది. వాళ్లు కూడా ఈ మహాబలుడి పాదాలకు చెప్పులు తయారుచేయలేక చేతులెత్తేశారు. వీరి పరిస్థితిపై స్థానిక మీడియా సంస్థ ప్రసారం చేసిన కథనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎట్టకేలకు ప్యూమా కంపెనీ సైజు 23 షూలను ప్రత్యేకంగా తయారు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే ఎరిక్ క్రీడల్లో పాల్గొనాలని షరతు పెట్టింది. నిజానికి ఎరిక్‌కు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. అయినప్పటికీ ఇతర పిల్లల మాదిరిగాకాకుండా అసాధారణంగా ఎదుగుతున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..