Rattlesnakes: పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..

|

Sep 18, 2024 | 12:31 PM

పంటపొల్లాల్లో, పంపుసెట్లలో ఎక్కడచూసినా కొండచిలువలే.. జనాలను భయంతో పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని సింగన్ గావ్ గ్రామ శివారులోని సోయా పంట పొలంలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలు, రైతు ఆ భారీ కొండచిలువను చూసి భయంతో పరుగులు తీశారు. ఆ వెంటనే గ్రామస్తులు తానూర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ షహబాజ్ కి సమాచారం అందించారు.

పంటపొల్లాల్లో, పంపుసెట్లలో ఎక్కడచూసినా కొండచిలువలే.. జనాలను భయంతో పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని సింగన్ గావ్ గ్రామ శివారులోని సోయా పంట పొలంలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలు, రైతు ఆ భారీ కొండచిలువను చూసి భయంతో పరుగులు తీశారు. ఆ వెంటనే గ్రామస్తులు తానూర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ షహబాజ్ కి సమాచారం అందించారు. వెంటనే అతను ఘటనా స్థలానికి చేరుకుని గంట పాటు శ్రమించి కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం కొండచిలువను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మొన్న విశాఖజిల్లాలో 12 అడుగుల భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. జీవీఎంసీ జోన్‌లోని ఆదర్శనగర్‌ ప్రాంతంలో ఓ పంప్‌ హౌస్‌ ఉంది. పంప్‌ హౌస్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు అక్కడి ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ సిద్ధమయ్యాడు. వాల్ దగ్గరకి దిగాడు. అక్కడ ఓ పెద్ద కొండచిలువ కనిపించడంతో బెంబేలెత్తిపోయాడు. ఒక్క ఉదుటన పంప్‌హౌస్‌నుంచి పైకి వచ్చి పడ్డాడు. అక్కడే ఉన్న మిగతా సిబ్బంది విషయం తెలుసుకుని నరేష్‌ను పైకి లేపి.. స్నేక్‌ కేచర్‌ కిరణ్‌కు సమాచారమిచ్చారు. కిరణ్‌ అక్కడకు చేరుకుని పామును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నాడు. ఒకానొక సమయంలో కిరణ్ ను కూడా శరీరమంతా చుట్టేసింది ఆ కొండచిలువ. అది కష్టం మీద కొండచిలువను అదుపులోకి తీసుకొని పైకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ కొండచిలువను అడవిలో వదిలేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on