Rat Tours: అగ్రరాజ్యంలో ఎలుకల సందడి.. న్యూయార్క్ లో ఇదే న్యూ ట్రెండ్.

|

Sep 10, 2023 | 9:10 AM

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో న్యూయార్క్ ఒకటి. ఇక్కడి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, సెంట్రల్ పార్క్, టైమ్స్ స్క్వేర్ ఎంతో ప్రజాదరణ పొందిన పర్యాటక స్థలాలు. అయితే, ఇప్పుడు న్యూయార్క్ నగరంలో మరొక అంశం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అదేంటో తెలుసా? ఎలుకలు! అవును అక్కడ అసాధారణ సంఖ్యలో ఎలుకలు దర్శనమిస్తున్నాయి.

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో న్యూయార్క్ ఒకటి. ఇక్కడి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, సెంట్రల్ పార్క్, టైమ్స్ స్క్వేర్ ఎంతో ప్రజాదరణ పొందిన పర్యాటక స్థలాలు. అయితే, ఇప్పుడు న్యూయార్క్ నగరంలో మరొక అంశం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అదేంటో తెలుసా? ఎలుకలు! అవును అక్కడ అసాధారణ సంఖ్యలో ఎలుకలు దర్శనమిస్తున్నాయి. దాంతో ఆ ప్రాంతం ఒక టూరిస్టు ప్లేస్‌లా మారిపోయింది. అంతేకాదు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఇది ఆదాయ వనరుగా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఎలుకలు ప్రతి చోటా కనిపిస్తాయి. కానీ, న్యూయార్క్ నగరంలో ఎలుకలు అసాధారణ స్థాయిలో వాటి జనాభాను పెంచుకున్నాయి. దాంతో న్యూయార్క్ నగరం అంటే మిగతా టూరిస్ట్ స్పాట్లతో పాటు ఎలుకలు కూడా అనే భావన నెలకొంది. అందుకే, టూరిస్టు గైడ్లు తమ షెడ్యూల్ లో నగరంలోని ఎలుకల సందర్శన కార్యక్రమాన్ని కూడా చేర్చేసుకున్నారు. కుప్పలుతెప్పలుగా ఉన్న న్యూయార్క్ ఎలుకలను చూసి తీరాల్సిందేనని గైడ్లు పర్యాటకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. పర్యాటకంగానే కాదు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు కూడా న్యూయార్క్ ఎలుకలు ఆదాయ వనరుగా మారాయి. కెన్నీ బోల్ వెర్క్ అనే వ్యక్తి కేవలం న్యూయార్క్ ఎలుకలపై వీడియోలు చేస్తూ టిక్ టాక్ స్టార్‌గా మారిపోయారు. ఇక్కడి మూషికాలపై ఏకంగా అతడు గంటన్నర పాటు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తే, వేలాది మంది వీక్షించారట. రియల్ న్యూయార్క్ అనే టూరిస్టు ఏజెన్సీ యజమాని ల్యూక్ మిల్లర్ దీనిపై స్పందిస్తూ, తాము నిర్వహించే సిటీ టూర్లలో కొలంబస్ పార్క్ ను కూడా చేర్చామని, అక్కడి ఎలుకల సంతతిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. కొన్నాళ్లుగా న్యూయార్క్ లో ఇదే ట్రెండ్ నడుస్తోందని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..