Rare Kachidi Fish: వలలో అరుదైన కచిడి చేపలు.. విలువంతా వాటి పొట్ట వల్లే..! సముద్ర గోల్డ్ ఫిష్ గా పేరు..

|

Jun 19, 2023 | 9:40 AM

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జాలర్లు వేసిన వలలో అరుదైన కచిడి చేపలు చిక్కాయి. మూడు మగ కచిడి చేపలు స్థానికులను అబ్బురపరిచాయి. మగ కచిడి చేప మూడు లక్షల రూపాయలకు దర పలకడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జాలర్లు వేసిన వలలో అరుదైన కచిడి చేపలు చిక్కాయి. మూడు మగ కచిడి చేపలు స్థానికులను అబ్బురపరిచాయి. మగ కచిడి చేప మూడు లక్షల రూపాయలకు దర పలకడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒక్కో చేపను వేలం పాటలో లక్ష రూపాయల ధరకు ఓ వ్యాపారస్తుడు కొనుగోలు చేశాడు. మొత్తం మూడు కచిడి మగ చేపలకు ఐదు లక్షల రూపాయలు వచ్చాయి. కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తారు. ఆ చేప పేరులో ఉన్నట్లుగా నిజంగానే అది బంగారంలానే విలువ కలిగి ఉంటుంది. మత్స్యకారుల పంట పండిస్తుంది. కచిడి చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. అలా ఎక్కడెక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు తిరుగుతుంది. చాలా అరుదుగా ఈ చేపలు మత్స్యకారుల వలలో చిక్కుతాయి. కచిడి చేప శాస్త్రీయ నామం..ప్రొటోనిబియా డయాకాన్తస్. సర్జరీ సమయంలో డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుంది. అంతేకాదు కాస్ట్లీ వైన్‌ తయారు చేసే పరిశ్రమల్లో కచిడి చేపను ఉపయోగిస్తారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!