Stonefishes: సముద్రపు అడుగున జీవించే అరుదైన చేప.. దీని సొగసు చూడతరమా
విశాఖపట్నంలో ఒక మత్స్యకారుడికి అరుదైన 'రాయి చేప' వలకు చిక్కింది. ఇండియన్ వాగాబాండ్ బటర్‌ఫ్లైగా కూడా పిలువబడే ఈ చేప, పసుపు-నలుపు చారల తోక, బూడిద-తెలుపు రంగు శరీరం కలిగి ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సుమారు 8 అంగుళాల వరకు పెరిగే ఈ జలచరం పగడపు దిబ్బల్లో నివసిస్తుంది. దీని విశేషాలు మరింత తెలుసుకోండి.
సముద్రంలో ఎన్నో రకాల జలచరాలు, జీవులు ఉంటాయి. రకరకాల చేపలు కూడా జీవనం సాగిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి రాయి చేప. రాయిచేపల్లోనూ వేరువేరు రకాలు, భిన్న రూపాలు.. వివిధ రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. చాలా అరుదుగా కనిపించే చేపలు.. అప్పుడప్పుడు జాలర్ల వలకు చిక్కుతూ ఉంటాయి. తాజాగా విశాఖకు చెందిన ఓ మత్స్యకారుడుకి ములుగు పాములు, ముళ్ళ కప్పలు లభ్యమయ్యాయి. వాటితో పాటు ఓ రాయి చేప కూడా వలకు చిక్కింది. ఆ చేప ఆకారం, రంగు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. పసుపు నలుపు చారల తోకతో , బూడిద, తెలుపు రంగు శరీరాన్ని కలిగి ఉండి.. వాటిపై లైట్ బ్రౌన్ కలర్ లో గీతలతో విశేషంగా కనిపించింది. తోక రెక్కలపై పసుపు రంగు గుర్తులు ఉన్నాయి. రాయి చేపగా పిలుచుకునే వీటికి ఇండియన్ వాగాబాండ్ సీతాకోకచిలుక అనే పేరు కూడా ఉంది. ఇవి 8 అంగుళాల వరకు పెరుగుతాయి. పగడపు దిబ్బలు, శిథిలాలు, రాతి ప్రాంతాల్లో సముద్రపు అడుగున ఇవి జీవిస్తాయి. ఆహార అన్వేషణలో పైకి వచ్చిన ఈ చేపలు వలకు చిక్కుతుంటాయి. అటువంటి వాటిలో ఎక్కువగా ముళ్లకప్పలు, ములుగు పాములు ఉంటాయి. వాటిలో కొన్నిటిని మత్స్యకారులు తిరిగి సముద్రంలో విడిచి పెడుతూ ఉంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ నాలుగు కారణాల వల్లే 99శాతం మందిలో గుండెపోటు
సరదాలకు శనివారం .. ఫ్యామిలీకి ఆదివారం .. మారిన ట్రెండ్
నడకతో మతిమరుపు దూరం..! మరి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి ??
Viral Video: ఇదేందిది.. ఇంటిపైన కొబ్బరిచెట్టా..! ఇలా కూడా పెంచుతారా !!
