Rare Creature: ఈ వింత జీవిని చూశారా..?? సీతాకోకచిలుక లక్షణాలతో బల్లి..!! వీడియో
ప్రపంచం ఎన్నో వింతల సమాహారం. కోట్లాది జీవుల నివాసం. వాటిలో కొన్ని జీవులు అత్యంత అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ అత్యంత అరుదైన జీవి సముద్ర తీరంలో దర్శనమిచ్చింది.
ప్రపంచం ఎన్నో వింతల సమాహారం. కోట్లాది జీవుల నివాసం. వాటిలో కొన్ని జీవులు అత్యంత అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ అత్యంత అరుదైన జీవి సముద్ర తీరంలో దర్శనమిచ్చింది. చూసేందుకు క్షీరదంలా కనిపిస్తోందిది. చూసేందుకు వింతగా కనిపిస్తున్న ఈ జీవిని ఏమనాలో తెలియదంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో కనిపిస్తున్న జీవికి సీతాకోకచిలుక మాదిరిగా రంగురంగుల రెక్కలున్నాయి. అదేవిధంగా బల్లిలాంటి తల.. తోకా వున్నాయి.. పాకుడు స్వభావం కలిగిన ఈ జీవిని బల్లి జాతికి చెందినదిగా పరిగణించాలా.. సీతాకోకచిలుకలో మరో వెరైటీ అనుకోవాలా తెలియదంటున్నారు నెటిజన్లు.. ఈ వీడియోని పోస్ట్ చేసిన ఫిగెన్ మాత్రం మొట్టమొదటిసారి ఇలాంటి జీవిని చూశానంటూ ట్వీట్ చేశారు. బటర్ ఫ్లై లిజార్డ్ అంటూ దానికి నామకరణం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అదృష్టం అంటే వీళ్లదే.. పిల్లిని పట్టి లక్షలు కొట్టేశారు..! వీడియో
Sanitizer: శానిటైజర్లతో మంచి తో పాటు ప్రమాదం కూడా.. తస్మాత్ జాగ్రత్త.. వీడియో