MLA Sirisha: సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే

|

Aug 11, 2024 | 9:41 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష గిరిజనులపై తన ఔదార్యం చూపించారు. తన సొంత నిధులతో గిరిజనుల కోసం అంబులెన్స్‌ సౌకర్యం కల్పించారు. శిరీష తన సొంత కారును అంబులెన్స్ గా మార్చేశారు. గిరిజనులు అత్యవసరంగా వైద్యం అందక ఇబ్బందులు పడడం చూసి తన 9 లక్షల రూపాయలతో ఈఎంఐ పద్ధతి ద్వారా కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష గిరిజనులపై తన ఔదార్యం చూపించారు. తన సొంత నిధులతో గిరిజనుల కోసం అంబులెన్స్‌ సౌకర్యం కల్పించారు. శిరీష తన సొంత కారును అంబులెన్స్ గా మార్చేశారు. గిరిజనులు అత్యవసరంగా వైద్యం అందక ఇబ్బందులు పడడం చూసి తన 9 లక్షల రూపాయలతో ఈఎంఐ పద్ధతి ద్వారా కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. ఆదివాసి దినోత్సవం కావడంతో ఈ అంబులెన్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు శిరీష. వాహనం పై కూటమి నేతలతో, స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్ర పటాలను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే.

అత్యవసర వైద్య సేవలు, హఠాన్మరణం, ఆసుపత్రిలో మృతి చెందినవారి మృత దేహాలను తమ ఇళ్లకు తరలించేందుకు గిరిజనుల కోసం భర్త విజయ భాస్కర్ సహకారం తో వాహనాన్ని ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే శిరీష దేవి. గిరిజన ప్రాంతం అభివృద్ధికీ, పెద్ద పీఠ వేసేందుకు తన వంతుగా ముందడుగు వేస్తున్నట్లు ఎమ్మెల్యే శిరీష తెలిపారు.. గిరిజనుల కష్టాలను దగ్గరగా చూసిన వ్యక్తి కావడం తో రంపచోడవరం మన్యం ప్రాంతంలో గిరిజనుల సంతోషమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే శిరీష వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.