మేనమామ చదివింపులే ఏకంగా రూ.1.56 కోట్లు!

Updated on: Nov 06, 2025 | 1:55 PM

ఆ పెళ్లిలో మేనమామ ఇచ్చిన కానుకలను చూసి అతిథులు ఆశ్చర్యపోయారు. పెళ్లి వేదిక వద్దకు లేఘా సోదరులు డబ్బు మూటలతోనూ, బంగారంతోనూ వచ్చారు. అందరూ చూస్తుండగా పీటల మీద కూర్చున్న ఇద్దరు వరుళ్లకు అందించారు. దీంతో ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ లోని బీకానేర్‌ జిల్లాలో జరిగిన రెండు పెళ్లిళ్ల గురించి అంతా చర్చించుకుంటున్నారు.

పెళ్లిలో పెట్టిన మైరా చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. నోఖా పట్టణంలో గిరధారి గోదారా, జగదీశ్‌ గోదారా అనే యువకుల వివాహం సందర్భంగా వారి మేనమామలు ఇచ్చిన మైరా ఆ స్థాయిలో చెప్పుకునేలా ఉంది. మైరా అంటే వధువు లేదా వరుడి మామ తన సోదరి కుటుంబానికి బహుమతులు, డబ్బు, దుస్తులు ఇచ్చి వివాహాన్ని జరిపించే ఓ ఆచారం. ఈ ఆచారం ద్వారా మామ వారిపై తన ప్రేమను వ్యక్తపరిచే ప్రక్రియగా భావిస్తారు. ఇది ప్రధానంగా రాజస్థాన్‌లో ఎక్కువ. తమ మేనల్లుళ్ల వివాహం కోసం సీనియాలా గ్రామానికి చెందిన భన్వర్‌, జగదీశ్‌ లేఘా సోదరులు భారీ మైరా ఇచ్చారు. పెళ్లిళ్లల్లో సాంప్రదాయంగా అన్నలు డబ్బు, బంగారం, వెండి, బట్టలు ఇచ్చే మైరా ఆచారం ఎప్పటి నుంచో ఉంది. ఇదే ఆచారాన్ని ఈ లేఘా సోదరులు పాటించారు. ఈ మేనమామలు ఇచ్చిన మైరా మొత్తం రూ. 1.56 కోట్లు. రూ.1 కోటి 11 లక్షల క్యాష్‌తో పాటు సుమారు ఒక కిలో 250 గ్రాముల వెండి, 31 తులాల బంగారం ఇచ్చారు. అంటే నగదు, బంగారం, వెండితో కలిపి మొత్తం రూ.1.56 కోట్లు విలువైన మైరా ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ కార్యక్రమానికి నాగౌర్‌ ఎంపీ హనుమాన్‌ బెనివాల్‌ హాజరయ్యారు. భన్వర్‌, జగదీశ్‌ లేఘా సోదరులు ఇది తమ కుటుంబంలో తొలి మైరా అని, అందుకే తమ అక్క పిల్లల పెళ్లికి ఇంత పెద్ద మొత్తంలో మైరా సమర్పించామని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Andhra Pradesh: అత్తకు తలకొరివి పెట్టిన ఆదర్శ కోడలు

22 ఏళ్లకే రూ. 8 వేల కోట్ల ఆస్తి అమెరికాలో మనోళ్ల సత్తా ఇదీ

ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన కోతి.. నేరుగా వెళ్లి

తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి.. గదిలో సీన్‌ చూసి షాక్‌

ఏ క్షణమైనా యుద్ధంలోకి అమెరికా