Train Late: ట్రైన్​ ను లేట్‌గా నడిపిన రైల్వేశాఖకు రూ. 60 వేలు ఫైన్ చెల్లించాలని కోర్టు తీర్పు.

|

Nov 01, 2023 | 6:27 PM

రైలును లేటుగా నడిపి ఓ ప్రయాణికుడిని అసౌకర్యానికి గురి చేసిన దక్షిణ రైల్వేకు రూ.60వేల జరిమానా విధించింది వినియోగదారుల కోర్టు. కేచెన్నై-అలెప్పీ ఎక్స్​ప్రెస్​ను​ 13 గంటలు ఆలస్యంగా నడిపి ఓ ప్రయాణికుడికి అసౌకర్యానికి కలిగించినందుకు రళలోని ఎర్నాకుళం వినియోగదారుల కోర్టు... ఈ జరిమానా విధించింది. ప్రయాణికుడికి పరిహారంగా రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కోసం మరో రూ.10 వేలు కలిపి మొత్తం రూ.60 వేలు ఇవ్వాలని చెప్పింది.

రైలును లేటుగా నడిపి ఓ ప్రయాణికుడిని అసౌకర్యానికి గురి చేసిన దక్షిణ రైల్వేకు రూ.60వేల జరిమానా విధించింది వినియోగదారుల కోర్టు. కేచెన్నై-అలెప్పీ ఎక్స్​ప్రెస్​ను​ 13 గంటలు ఆలస్యంగా నడిపి ఓ ప్రయాణికుడికి అసౌకర్యానికి కలిగించినందుకు రళలోని ఎర్నాకుళం వినియోగదారుల కోర్టు.. ఈ జరిమానా విధించింది. ప్రయాణికుడికి పరిహారంగా రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కోసం మరో రూ.10 వేలు కలిపి మొత్తం రూ.60 వేలు ఇవ్వాలని చెప్పింది. ఈ మొత్తాన్ని 30 రోజుల వ్యవధిలో చెల్లించాలని దక్షిణ రైల్వేకు స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుడు తన ప్రయాణ ఉద్దేశాన్ని ముందుగా తెలుపలేదని.. అందువల్లే ముందు జాగ్రత్తలు తీసుకోలేదని రైల్వే శాఖ వాదించింది. వారి వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. చెన్నై డివిజన్​లోని అరక్కోణం వద్ద రైల్వేయార్డు పునర్​నిర్మాణ పనుల వల్లే ఆలస్యమైందని గుర్తించింది. పనుల విషయం ముందే తెలిసినా.. ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వడం, సౌకర్యాలు కల్పించడంలోనూ విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నాణ్యమైన సేవలను పొందడం ప్రయాణికులకు వరం కాదని.. వారి హక్కు అని గుర్తు చేసింది.

గతంలో ఒక వ్యక్తి తమ కుటుంబ సభ్యుల కోసం బుక్​ చేసుకున్న రైలు టిక్కెట్​లను వేరే వాళ్లకు కేటాయించినందుకు గానూ భారతీయ రైల్వేకు రూ.40 వేల జరిమానా విధించింది వినియోగదారుల కమిషన్. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. వైట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటున్న అలోక్‌ కుమార్‌ అనే వ్యక్తి 2022 మార్చి 15న తల్లిదండ్రులు, అతడి ప్రయాణం కోసం ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​లో టికెట్స్​ బుక్​ చేసుకున్నాడు. మే 21న దిల్లీ నుంచి బిహార్​లోని బరౌనీకి వెళ్లేందుకు రాజధాని ఎక్స్​ప్రెస్​ రైలులో రూ.6,995 కట్టి సీట్లను రిజర్వ్​ చేయించుకున్నాడు. అయితే, ప్రయాణం రోజున రైలు ఎక్కే సమయంలో ప్రయాణికుల పీఎన్​ఆర్​ (PNR) నంబర్​ సరిగ్గానే ఉందని.. కానీ టికెట్​ ఇంకా కన్ఫామ్​ కాలేదని రైల్వే సిబ్బంది తెలిపారు. దీంతో తమకు ముందుగా కేటాయించిన రిజర్వ్​డ్​ సీటును వేరే వ్యక్తులకు ఎలా కేటాయిస్తారన్న విషయంపై కోర్టును ఆశ్రయించాడు ఓ వ్యక్తి. దీనిపై విచారించిన కోర్టు.. రూ.40 వేల నష్టపరిహారం చెల్లించాలని భారతీయ రైల్వే శాఖను ఆదేశించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..