Railway Restaurant: నోరూరించే రుచులతో దూసుకొచ్చిన రైల్వే కోచ్ రెస్టారెంట్.. మన దగ్గరలోనే.

|

Oct 01, 2023 | 12:20 PM

విజయవాడలో ఫుడ్ లవర్స్ చాలా ఎక్కువండి..! ఎలాంటి రకమైన వంటైనా సరే.. రుచిగా ఉండాలే కానీ.. ఎక్కడికైనా వెళ్తుంటారు. వాళ్ళందరి కోసమే సెంట్రల్ రైల్వేస్ సరికొత్త ఆకర్షణతో దేశంలోని అన్ని రుచులను ఒక చోటే తీసుకువచ్చారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ తాలి అన్నీ ఒక దగ్గరే. టిఫిన్స్ దగ్గర నుంచి వెజ్, నాన్ వెజ్ వరకు అన్నిరకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి.

విజయవాడలో ఫుడ్ లవర్స్ చాలా ఎక్కువండి..! ఎలాంటి రకమైన వంటైనా సరే.. రుచిగా ఉండాలే కానీ.. ఎక్కడికైనా వెళ్తుంటారు. వాళ్ళందరి కోసమే సెంట్రల్ రైల్వేస్ సరికొత్త ఆకర్షణతో దేశంలోని అన్ని రుచులను ఒక చోటే తీసుకువచ్చారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ తాలి అన్నీ ఒక దగ్గరే. టిఫిన్స్ దగ్గర నుంచి వెజ్, నాన్ వెజ్ వరకు అన్నిరకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి. భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు, పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రాజెక్టుల్ని కూడా చేపడుతోంది. అందులో భాగంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో కోచ్ రెస్టారెంట్లను ప్రారంభిస్తోంది. దేశంలోని ఇతర రైల్వే స్టేషన్లలో పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న కోచ్ రెస్టారెంట్ ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్‌లో కూడా ప్రారంభమైంది. స్లీపర్ కోచ్‌కు మార్పులు చేసి రెస్టారెంట్‌గా మార్చారు. ఈ రెస్టారెంట్‌ను రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రారంభించారు. కోచ్ రెస్టారెంట్ లోపల, బయట సుందరంగా తీర్చిదిద్దారు. రైలు ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలు కూడా కోచ్ రెస్టారెంట్‌ను సందర్శించి ఇక్కడి రుచులను ఆస్వాదించవచ్చు.. మల్టీక్యూడిన్ ఎయిర్ కండీషన్డ్ రెస్టారెంట్ గా దీనిని తీర్చిదిద్దారు. మంచి నాణ్యత గల ఆహారం తక్కువ ధరకే లభిస్తుంది. స్నాక్స్‌తో ముందుగా మొదలు పెడితే చాట్స్, పానీపూరి, రైస్ బౌల్స్, ఫ్లేవర్స్ అఫ్ సౌత్ అంటూ ఎన్నో రకాల దోశలను అందిస్తున్నారు. ఫ్లేవర్స్ అఫ్ నార్త్ అని డాల్ రైస్,వెజ్ కర్రీస్, శాండ్విచ్చెస్ , ఇండియన్ బ్రెడ్స్, స్వీట్స్, ఐస్క్రీమ్స్ ఇలా ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్నారు. సర్వింగ్ కానీ, సిట్టింగ్ వాతావరణం కాని చూస్తే.. సూపర్. వీరి దగ్గర టేక్ అవే ఆప్షన్ కూడా ఉందండోయ్..! ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ తో ఆర్డర్ చేసుకోవచ్చు. రైల్వే ప్రయాణికులకు 24 గంటలూ ఈ రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ రెస్టారెంట్ ద్వారా రైల్వేకు అదనంగా ఆదాయం సమకూరుతుందని రైల్వే శాఖ భావిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..