Hidden Treasure: తాంత్రికుల మాటలు నమ్మి గుప్తనిధుల కోసం సొంతింటిలోనే తవ్వకాలు..

|

Sep 01, 2023 | 9:56 PM

చదివింది ఇంజనీరింగ్.. మంచి ఉద్యోగం చేశాడు.. విదేశాలకూ వెళ్లొచ్చాడు.. అయినా డబ్బు సంపాదించ లేకపోయాడు. ఈజీ మనీకోసం అలవాటు పడ్డ ఓ ఇంజనీర్ సొంత ఇంటికే కన్నం వేశాడు. మాంత్రికుల మాటలు నమ్మి.. క్షుద్ర పూజలు చేశాడు. చివరికి సొంతింటిలోనే గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపాడు. ఇంతకు గుప్తనిధులు దొరికాయా.. ఆ సివిల్ ఇంజనీర్ ఏమయ్యాడు..?

చదివింది ఇంజనీరింగ్.. మంచి ఉద్యోగం చేశాడు.. విదేశాలకూ వెళ్లొచ్చాడు.. అయినా డబ్బు సంపాదించ లేకపోయాడు. ఈజీ మనీకోసం అలవాటు పడ్డ ఓ ఇంజనీర్ సొంత ఇంటికే కన్నం వేశాడు. మాంత్రికుల మాటలు నమ్మి.. క్షుద్ర పూజలు చేశాడు. చివరికి సొంతింటిలోనే గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపాడు. ఇంతకు గుప్తనిధులు దొరికాయా.. ఆ సివిల్ ఇంజనీర్ ఏమయ్యాడు..? యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం రెడ్డివాడకు చెందిన రఘుపాల్ సింగ్ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. భువనగిరి మున్సిపాలిటీలో కొద్ది రోజులు కాంట్రాక్ట్ సివిల్ ఇంజనీర్‌గా పని చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో పేరున్న బిల్డర్స్‌ కంపెనీలో సైట్‌ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఎక్కడా నిలకడ లేని తత్వం రఘుపాల్ సింగ్ ది. డబ్బు సంపాదించాలనే ఆశతో దుబాయికి వెళ్లాడు. అక్కడా ముణ్ణాళ్ల ముచ్చటగానే పనిచేసి తిరిగి హైదరాబాద్‌ కు వచ్చాడు. ఈజీ మనీ కోసం ఎన్నో పథకాలు వేశాడు కానీ.. ఫలించలేదు. గుప్తనిధుల ద్వారానే ఈజీమని సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం గుప్తనిధుల వేట సాగించాడు. ఈ క్రమంలోనే రఘుపాల్ సింగ్‌కు కొందరు తాంత్రికులు తోడయ్యారు. సొంతింటిలోనే గుప్త నిధులు ఉన్నాయని.. కొన్ని క్షుద్ర పూజలు చేయాలని నమ్మించారు. మాంత్రగాళ్ళు చెప్పినట్లుగానే శిథిలావస్థలో ఉన్న తన సొంతింటిలో క్షుద్ర పూజలు చేశాడు. వారం రోజులుగా హైదరాబాద్‌కు చెందిన కొంతమందితో కలిసి గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు గుప్తనిధుల తవ్వకాల ఆనవాళ్ళు గుర్తించారు. రఘుపాల్ సింగ్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..