Viral Video: సేమ్‌ టు సేమ్‌.. టామ్‌ అండ్‌ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

|

Feb 19, 2022 | 6:56 PM

Viral Video: జనాల్లో క్రియేటివిటీ రోజురోజుకీ బాగా పెరిగిపోతుంది. నిజానికి ఈ క్రియేటివిటీ ఇప్పటికిప్పుడు వచ్చింది కాకపోయినా.. సోషల్‌ మీడియా కారణంగా ప్రస్తుతం ప్రపంచానికి తెలుస్తోంది. తమ నైపుణ్యానికి పదును పెట్టి కొందరు క్రియేటర్స్‌..

Viral Video: సేమ్‌ టు సేమ్‌.. టామ్‌ అండ్‌ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Pushpa Viral Video
Follow us on

Viral Video: జనాల్లో క్రియేటివిటీ రోజురోజుకీ బాగా పెరిగిపోతుంది. నిజానికి ఈ క్రియేటివిటీ ఇప్పటికిప్పుడు వచ్చింది కాకపోయినా.. సోషల్‌ మీడియా కారణంగా ప్రస్తుతం ప్రపంచానికి తెలుస్తోంది. తమ నైపుణ్యానికి పదును పెట్టి కొందరు క్రియేటర్స్‌ రూపొందిస్తున్న మీమ్స్‌, జోక్‌లు నెట్టింట ఎలాంటి నవ్వులు పూయిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పటిలా సినిమాలు చూసి వదిలేయకుండా వాటిపై చిన్న స్థాయి పరీశోధనలు చేస్తున్నారు. సినిమాల్లోని చిన్న చిన్న పాయింట్స్‌ను సైతం పట్టుకొని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట తెగ హల్చల్‌ చేస్తోంది.

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఒక్కసారిగా జాతీయ సినిమాను షేక్‌ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా విడుదలై మూడు నెలలు గడుస్తోన్నా నార్త్‌ నుంచి సౌత్‌ వరకు ఇప్పటికీ ఈ సినిమా తాలుకు బజ్‌ కొనసాగుతూనే ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న మీమర్స్‌ కూడా పుష్పను తమ క్రియేటివీ ప్రదర్శించుకోవడానికి సాధనంగా ఉపయోగించుకుంటున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా పుష్ప సినిమాలోని సన్నివేశాలను, టామ్‌ అండ్‌ జెర్రీ కామిక్‌ సిరీస్‌కు లింక్‌ చేసి రూపొందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక ‘సామి సామి’ స్టేప్‌ నుంచి అల్లు అర్జున్‌ ‘తగ్గేదేలే’ మేనరిజం వరకు అన్ని సన్నివేశాలను టామ్‌ అండ్‌ జెర్రీ వీడియోలకు సింక్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నెటిజన్ల క్రియేటివిటీకి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. మరి ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: BECIL Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

Vani Bhojan: వావ్ అనిపిస్తున్న వాణి భోజన్ లేటెస్ట్ పిక్స్

Pushpa: పుష్ప యూనిట్‌కు కీలక సూచనలు చేసిన అల్లు అర్జున్‌.. ఆ తప్పు మళ్లీ చేయొద్దంటూ..