నక్క తోక తొక్కడం అంటే ఇదే కాబోలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ
నక్క తోక తొక్కడం అంటే ఇదే కాబోలు. రూ.6 పెట్టి టికెట్ కొంటే ఏకంగా కోటి రూపాయల లాటరీ తగిలింది. అది కూడా ఓ దినసరి కూలీని లాటరీ వరించింది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. రోజువారీ కూలీ జాస్మాయిల్ సింగ్ అనే వ్యక్తికి ఈ జాక్‌పాట్ తగలడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఇటుక బట్టీలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్న జాస్మాయిల్, ఫిరోజ్‌పూర్ జిల్లాలోని జిరాను సందర్శించేటప్పుడు ఈ లక్కీ టికెట్‌ను కొనుగోలు చేశాడు.
కొనుగోలు చేసిన కొన్ని గంటల తర్వాత, అతనికి జీవితాన్ని మార్చే ఫోన్ కాల్ వచ్చింది. శర్మ జీ ఫోన్ చేసి, మీ నంబర్ చెక్ చేసుకోండి, మీరు కోటి రూపాయలు గెలుచుకున్నారని అన్నారు. నమ్మలేకపోయాను అంటూ జాస్మాయిల్ ఉబ్బితబ్బిబయ్యారు. ఈ వారం ప్రారంభంలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విజేత టికెట్ డ్రా తీశారు. ఆనందంతో ఉప్పొంగిపోయిన జాస్మాయిల్, అతని కుటుంబం గ్రామంలో స్వీట్లు పంచి, డ్రమ్స్ వాయిస్తూ, డాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ డబ్బులో నుంచి 25 లక్షల రూపాయల రుణం తీర్చడానికి, పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని లాటరీ విజేత ప్రకటించారు. ఫిరోజ్‌పూర్ జిల్లా వాసులు లాటరీ ద్వారా లక్షాధికారి కావడం ఇది నాల్గవసారి అని స్థానిక దుకాణదారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూల్లో మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న చిన్నారి.. అంతలోనే..!
ఇక.. డబ్బు లేకుండానే గ్యాస్ సిలిండర్లు
వర్షాకాలంలో ఈ పండ్లు తిన్నారో.. రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే..
నాడు నైట్ వాచ్‌మెన్‌గా జీతం రూ.165… నేడు.. కోట్లు సంపాదిస్తున్న నటుడు
బెంగుళూర్ గుహలో పిల్లలతో రష్యన్ మహిళ.. వివరాల్లోకి వెళ్లగా ఖంగుతిన్న పోలీసులు..