ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
కడప జిల్లా పులివెందులలో ఒక రైతు తన కోళ్ళ ఫారంలోకి పాములు, ఎలుకలు రాకుండా పెట్టిన బోనులో అరుదైన పునుగు పిల్లి చిక్కింది. ఇది తిరుమల శ్రీవారి తైలాభిషేకానికి ఉపయోగించే తైలం ఉత్పత్తికి ప్రసిద్ధి. రైతు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి పునుగు పిల్లిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. ఈ అరుదైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
తన కోళ్ల ఫారంలో పాములు, ఎలుకలు, పందికొక్కులు చొరబడుతున్నాయని బోను ఏర్పాటు చేశాడు రైతు. మర్నాడు ఉదయం అతను బోనులో ఎలుకలు ఏమైనా పడ్డాయా అని చూసిన అతనికి అందులో ఊహించని జంతువు కనిపించింది. దాంతో అతను వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చాడు. రైతు సమాచారంతో అక్కడికి చేరుకొని ఆ జంతువును అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. కడప జిల్లా పులివెందులలోని స్థానిక చిన్న రంగాపురం గ్రామంలో విశ్వనాథరెడ్డి అనే రైతు తన ఇంటి వద్దనున్న ఖాళీ ప్రదేశంలో కోళ్ళ పెంపకం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా కోడి పిల్లల కోసం ముంగిసలు పాములు, పందికొక్కులు రావడాన్ని గమనించిన రైతు ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశాడు. ఓ రోజు అనూహ్యంగా ఆబోనులో పునుగు పిల్లి ఉండడాన్ని గమనించిన విశ్వనాథరెడ్డి మొదట దానిని ఏదో వింత జంతువుగా భావించాడు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. అక్కడికి చేరుకున్న పులివెందుల ఫారెస్ట్ అధికారి గోపాలకృష్ణయ్య దానిని పునుగు పిల్లిగా గుర్తించారు. విశ్వనాథరెడ్డి ఆ పునుగుపిల్లిని అటవీశాఖ అధికారికి అప్పగించాడు. పునుగుపిల్లి చాలా అరుదైనది; దీని నుంతి వచ్చే తైలం స్వయంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తైలాభిషేకానికి వినియోగిస్తారు. ఈ పునుగుపిల్లి సాధారణంగా తిరుమల పరిసర ప్రాంతాలలోని నల్లమల అటవీ ప్రాంతంలో కనబడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అది కడప జిల్లాలోని పులివెందుల అటవీ ప్రాంతంలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2025లో గూగుల్‌లో ఎక్కువ ఎవరికోసం సెర్చ్ చేసారో తెలుసా ??