6 నెలలకే పుట్టిన చిన్నారి.. బతికించిన హైదరాబాద్ వైద్యులు

Updated on: Aug 26, 2025 | 11:35 AM

వైద్య రంగంలో ఊహించని అద్భుతం జరిగింది. కేవలం 23 వారాలకే, అర కిలో బరువుతో జన్మించిన ఓ పసికందు.. తీవ్ర అనారోగ్యం పాలైన వేళ.. హైదరాబాద్ వైద్యులు 4 నెలల పాటు వైద్యం చేసి.. ఆ చిన్నారికి వైద్యం చేసి.. బతికించారు. దీంతో .. ఇన్నాళ్లూ మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి.. సంపూర్ణ ఆరోగ్యంతో తల్లిదండ్రుల దగ్గరికి చేరాడు. నియోనాటల్ చరిత్రలోనే ఇది ఒక అద్భుతమని వైద్యులు ప్రశంసిస్తున్నారు.

ఇక.. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. సూడాన్‌కు చెందిన ఇన్సాఫ్ అనే మహిళ.. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చింది. ఆమె గర్భంలో మూడు పిండాలు పెరగ్గా, వాటిలో ఒకటి అభివృద్ధి చెందకపోవటంతో తొలగించాల్సి వచ్చింది. ఇక.. మిగిలిన ఇద్దరు శిశువులు గత ఏప్రిల్ 18న, కేవలం 23 వారాలకే జన్మించారు. వారిలో ఒక బిడ్డ పుట్టిన తొమ్మిదవ రోజే కన్నుమూశాడు. ఇక.. మూడవ బిడ్డ కేవలం 565 గ్రాముల బరువుతో ఉండటంతో.. ఆ ఒక్క శిశువునైనా దక్కించుకోవాలని ఆ తల్లిదండ్రులు ఆరాట పడ్డారు. ఈ పరిస్థితిలో ఆసుపత్రి వైద్యులు అండగా నిలిచారు. వెంటనే వైద్యులు ఒక స్పెషల్ టీంగా ఏర్పడి.. శిశువును తమ ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించి చికిత్స ప్రారంభించారు. ఆ వైద్య బృందం 115 రోజుల పాటు 24 గంటలూ.. పసికందును కంటికి రెప్పలా కాపాడింది. శిశువు గుండె, మెదడు, రెటీనా పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఈ టైంలోనే.. చిన్నారికి గుండె సమస్య ఉందని గుర్తించి.. దానికీ మందులతో చికిత్స చేశారు. సుదీర్ఘ చికిత్స అనంతరం శిశువు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడి, 2 కిలోల బరువుకు చేరుకున్నాడు. దీంతో ఆగస్టు 11న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. 23 వారాలకు పుట్టిన శిశువులు బతకటం చాలా కష్టమని, అందులోనూ ఈ చిన్నారికి అనేక అనారోగ్య సమస్యలున్నాయని.. అయితే.. తమ డాక్టర్ల టీం ఒక గొప్ప సంకల్పంతో పనిచేసి.. ఈ చిన్నారిని బతికించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లిలో డాన్స్‌ చేస్తున్న వరుడు.. చెప్పుతీసిన వధువు.. ట్విస్ట్‌ అదిరిందిగా

కేపీహెచ్‌బీలో భూమికి రికార్డు ధర

వాహనదారులకు అలర్ట్‌.. ఈ రహదారులపై ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ చెల్లదు

ప్రాణభయంతో తలను నొక్కిపట్టాడు.. పాముకు ఏమైందంటే..

కప్పు ఛాయ్‌ వెయ్యి రూపాయలా? పేదవాడిలా ఫీల్ అయ్యా