ఇక్కడ పోస్ట్‌ ఆఫీసు రాత్రి వేళ కూడా పని చేస్తుంది

|

Jan 11, 2024 | 9:39 PM

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైనా ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం ఐదు గంటలవరకే పనిచేస్తాయి. కానీ ఇక్కడ ఓ పోస్ట్‌ ఆఫీసు రాత్రివేళకూడా పనిచేస్తుంది. పోస్ట్ ఆఫీస్ సేవలు పగలు మాత్రమే ఉంటాయని తెలుసు.. కానీ నైట్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటున్నదని చాలా మందికి తెలియదు. ఖమ్మం రైల్వే స్టేషన్ లో ఉన్న రైల్వే మెయిల్ సర్వీస్ (RMS) ఆఫీస్ లో 'నైట్ పోస్టాఫీస్' పేరుతో సేవలను తపాలా శాఖ అమలు చేస్తోంది.

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైనా ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం ఐదు గంటలవరకే పనిచేస్తాయి. కానీ ఇక్కడ ఓ పోస్ట్‌ ఆఫీసు రాత్రివేళకూడా పనిచేస్తుంది. పోస్ట్ ఆఫీస్ సేవలు పగలు మాత్రమే ఉంటాయని తెలుసు.. కానీ నైట్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటున్నదని చాలా మందికి తెలియదు. ఖమ్మం రైల్వే స్టేషన్ లో ఉన్న రైల్వే మెయిల్ సర్వీస్ (RMS) ఆఫీస్ లో ‘నైట్ పోస్టాఫీస్’ పేరుతో సేవలను తపాలా శాఖ అమలు చేస్తోంది. మెయిన్ పోస్ట్ ఆఫీస్ లో ప్రత్యేక కౌంటర్ సాయంత్రం 4 గంటలనుంచి ఏడున్నవరకూ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ లోని RMS కార్యాలయంలో సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తుంది. రాత్రి తపాలా సేవల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధం లేని అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. తపాలా బిళ్లల విక్రయం, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, పార్సిల్ బుకింగ్ వంటివి అత్యవసరంగా వినియోగించుకునే వారి కోసం ఈ సేవలను తపాలా శాఖ ప్రవేశపెట్టింది. చాలావరకు వీటి గురించి ప్రచారం లేక పోవడంతో వినియోగదారులు 4 గంటల తర్వాత రావడం లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యప్ప భక్తులకు స్పాట్‌ బుకింగ్‌ రద్దు

38 విమానాలు, 300 కార్లు సొంతం, రూ.3 లక్షల కోట్ల ఆస్తి

శ్రీరాముడిపై భక్తి.. 1001 మందికి ఫ్రీగా పచ్చబొట్లు

ప్రయాణికులకు షాకిచ్చిన ఇండిగో.. ఆ ఛార్జీలు పెంచేసిందిగా !!

అయోధ్యలో రాముడి విగ్రహం ఊరేగింపు రద్దు