Viral News: ఒక్క వీడియోతో.. ఆమె ఉద్యోగం ఊడింది.!(Video)
ఆమె బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగి. పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియో దెబ్బకు.. ఏకంగా ఆమె ఉద్యోగమే ఉష్ పటాక్ అయిపోయింది. ఇంతకీ ఆ వీడియో ఏంటి.?
పోలీస్ యూనిఫాంలో ఉండి రివాల్వర్ చేతిలో పట్టుకొని సినిమాలో మాదిరిగా డైలాగ్స్ చెబుతూ ఓ వీడియోను షూట్ చేసింది ప్రియా మిశ్రా. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆమె తీరును తూర్పారబట్టారు. ఓ పోలీసు అయి ఉండీ ఇలా చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఇక ఈ వ్యవహారం కాస్త.. పైఅధికారులు దృష్టికి వెళ్లడంతో.. ఆమెను విధులకు దూరంగా ఉంచారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయిన ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా అధికారులు ప్రియాంకామిశ్రా రాజీనామాను ఆమోదించి, విధుల నుంచి తొలగించారు.