PM Modi: జర్మనీ గాయని భక్తి గీతానికి దరువేసిన ప్రధాని మోదీ.. వీడియో.

|

Feb 29, 2024 | 5:27 PM

శ్రీరామ తారకమంత్రం ఎంతటివారినైన మంత్రముగ్ధులను చేస్తుంది. అందుకే తాగరా శ్రీరామనామామృతం అన్నాడు అన్నమయ్య. నిజంగా రామనామం అమృతమే. ఇది కేవలం భారతీయులకే కాదు. ఆ తారకమంత్రానికి, ఆ దివ్యమంగళస్వరూపానికి పాశ్చాత్య దేశాల ప్రజలు సైతం ఆథ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో...

శ్రీరామ తారకమంత్రం ఎంతటివారినైన మంత్రముగ్ధులను చేస్తుంది. అందుకే తాగరా శ్రీరామనామామృతం అన్నాడు అన్నమయ్య. నిజంగా రామనామం అమృతమే. ఇది కేవలం భారతీయులకే కాదు. ఆ తారకమంత్రానికి, ఆ దివ్యమంగళస్వరూపానికి పాశ్చాత్య దేశాల ప్రజలు సైతం ఆథ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్ మాన్ గళం నుండి వెలువడిన ఈ అచ్యుతాష్టకం.. ఆ పాశ్చాత్య గాయని శ్రీరాముడి భక్తిగీతం పాడిన వీడియో గురించి ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లోనూ, సోషల్ మీడియాలోనూ స్పందించారు. ఆ జర్మనీ గాయని తన తల్లితో కలిసి భారత్ రాగా… వారిని ప్రధాని మోదీ కలుసుకున్నారు.

తమిళనాడులోని పల్లడం వద్ద కసాండ్రా మే స్పిట్ మాన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆమె అచ్యుతమ్ కేశవమ్ భక్తి గీతాన్ని ఎంతో భక్తిగా శ్రావ్యంగా ఆలపించారు. ఆమె అలా పాడుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ తన చేతులతో దరువేస్తూ ఆమె పాటను ఆస్వాదించారు. అంతేకాదు, వాహ్ అంటూ ఆమెను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. జర్మనీ జాతీయురాలైన కసాండ్రా మే స్పిట్ మాన్ అనేక భారతీయ భాషల్లో భక్తి గీతాలు పాడుతూ గుర్తింపు పొందారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..