అయిదో అంతస్తులో పెట్రోల్ బంక్.. అంతపైకి ఎలా వెళ్తారు ??

|

Sep 14, 2023 | 8:50 PM

పెట్రోల్ బంకులను సాధారణంగా నేలమీద ఏర్పాటు చేస్తారు. కానీ అయిదో అంతస్తులో పెట్రోల్ బంక్ ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? లేదు కదూ! కానీ చైనాలో సరిగ్గా ఓ భవనం ఐదో అంతస్తులో పెట్రోల్ బంక్ నిర్మించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే, ఇలా అన్ని అంతస్తులపైన పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. వీడియో చూడగానే చాలా మందికి అసలు విషయం అర్థం కాలేదు.

పెట్రోల్ బంకులను సాధారణంగా నేలమీద ఏర్పాటు చేస్తారు. కానీ అయిదో అంతస్తులో పెట్రోల్ బంక్ ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? లేదు కదూ! కానీ చైనాలో సరిగ్గా ఓ భవనం ఐదో అంతస్తులో పెట్రోల్ బంక్ నిర్మించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే, ఇలా అన్ని అంతస్తులపైన పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. వీడియో చూడగానే చాలా మందికి అసలు విషయం అర్థం కాలేదు. దీంతో, కొన్ని సెటైర్లు కూడా పేలాయి. చైనాలోని ఓ కొండ ప్రాంతంలో ఘాట్ రోడ్లు ఉన్నాయి. అక్కడే పెద్దపెద్ద అపార్ట్‌మెంటులు కూడా ఉన్నాయి. అక్కడ సీన్ ఎలా ఉందంటే తక్కువ ఎత్తులో ఉన్న భవనం చివరి అంతస్తు పక్కనే ఘాటు రోడ్డు వెళ్లేలా నిర్మాణాలు జరిపారు. మరి అలాంటి చోట పెట్రోల్ బంకుల కోసం ప్రత్యేకంగా స్థలం దొరకదు కాబట్టి భవనంపైనే దాన్ని ఏర్పాటు చేశారు. భవనం పైఅంతస్తుకు పక్కనే ఉన్న ఘాట్ రోడ్డులోని వాహనాలు ఇంధనం నింపుకునేందుకు ఆగుతున్నాయి. ఇందుకు వీలుగా భవనం పైఅంతస్తును రోడ్డుతో అనుసంధానం చేశారు. అంతేకాదు..భనవం మధ్య నుంచి వాహనాలు వెళ్లేలా కూడా రోడ్డు నిర్మించారు. ఇదంతా చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చైనా వాళ్ల క్రియేటివిటీ పీక్స్‌లో ఉందంటూ అనేక మంది కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూకంపానికి ఊగిపోయిన పెళ్లి వేదిక.. పరుగులు తీసిన జనం..

థియేటర్‌లో చిమ్మచీకట్లో.. ఇదేం పని బాస్‌.. ఇక్కడ కూడా ఆపర

హోటల్లో టేబుల్‌ శుభ్రం చేస్తున్న వెయిటర్.. అంతలోనే..

70 మందితో వెళ్తున్న విమానం.. ఉన్నట్టుండి పొలాల్లో ల్యాండింగ్‌..