Dog vs Snake: యజమాని కోసం త్రాచుపాముతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన పెంపుడు కుక్క.

|

Oct 02, 2023 | 12:28 PM

యజమానిని కాపాడేందుకు పాముతో పోరాడి ప్రాణాలు కోల్పోయిందో శునకం. చెన్నై సమీపంలో ఆవడికి చెందిన మదివాణన్‌-నందిని దంపతులు తమ ఇంట్లో రెండు శునకాలను పెంచుతున్నారు. ఎప్పటిలాగానే గురువారం మదివాణన్‌ ఉద్యోగానికి వెళ్లారు. నందిని మాత్రమే ఇంట్లో ఉంది. ఇంటి వెనుక శునకాలు పెద్దగా అరుస్తుండటంతో నందిని చూడటానికి బయటకు వస్తుండగా ఆమెను రానివ్వకుండా రెండు శునకాలు అడ్డుకున్నాయి.

యజమానిని కాపాడేందుకు పాముతో పోరాడి ప్రాణాలు కోల్పోయిందో శునకం. చెన్నై సమీపంలో ఆవడికి చెందిన మదివాణన్‌-నందిని దంపతులు తమ ఇంట్లో రెండు శునకాలను పెంచుతున్నారు. ఎప్పటిలాగానే గురువారం మదివాణన్‌ ఉద్యోగానికి వెళ్లారు. నందిని మాత్రమే ఇంట్లో ఉంది. ఇంటి వెనుక శునకాలు పెద్దగా అరుస్తుండటంతో నందిని చూడటానికి బయటకు వస్తుండగా ఆమెను రానివ్వకుండా రెండు శునకాలు అడ్డుకున్నాయి. దీంతో ఆమె పరిశీలనగా చూడగా అక్కడ ఐదడుగుల పొడవున్న త్రాచుపాము కనిపించింది. రెండు శునకాలు పాముతో పోరాటానికి దిగాయి. ఓ శునకం పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ లోగా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని పామును పట్టుకుని సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. యజమానిని కాపాడటానికి ప్రాణాలు కోల్పోయిన శునకాన్ని చూసి అక్కడున్న వారంతా కంటతడిపెట్టుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 02, 2023 12:01 PM