ఏకంగా 150 సార్లు కరిచిన కుక్క- అయినా విడిచిపెట్టని యజమాని
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. వీధి కుక్కలే కాదు.. పెంపుడు కుక్కలు కూడా దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో యజమానిపైనే దాడికి పాల్పడింది అతని పెంపుడుకుక్క.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. వీధి కుక్కలే కాదు.. పెంపుడు కుక్కలు కూడా దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో యజమానిపైనే దాడికి పాల్పడింది అతని పెంపుడుకుక్క. వీధి కుక్కలైనా అక్కడక్కడా కరిచి వదిలేస్తాయేమో, కానీ ఈ పెంపుడు కుక్క మాత్రం ఏకంగా నూటయాభైసార్లు కసితీరా కొరికేసింది. నాలుగేళ్లుగా ప్రాణానికి ప్రాణంలా పెంచుకుంటూ కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. దానికి మురిపెంగా లక్కీ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఎప్పటిలాగే తలపై నిమరడానికి ప్రయత్నించాడు యజమాని నాగరాజు. ఏమైందో ఏమో అలా చెయ్యి వెయ్యగానే అమాంతం అతనిపై దాడి చేసింది. గొంతు పట్టుకుని కొరికేందుకు ప్రయత్నించగా అతను చెయ్యి అడ్డుపెట్టడంతో చేతికి కొరికేసింది. దాదాపు 15 నిమిషాలపాటు దాడిచేసి దొరికినచోటల్లా కసితీరా కరిచిపారేసింది. దాంతో, దెబ్బకు ఆస్పత్రి బెడ్ ఎక్కాల్సి వచ్చింది ఆ కుక్క యజమాని.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదనపు కట్నం అడిగిన వరునికి దిమ్మదిరిగే షాక్ !!
మహానటి !! సీరియల్లో యాక్టింగ్ వద్దన్న భర్తకు చావు చూపించింది
Dasara: దంచికొడుతున్న దసరా.. అప్పుడే 47కోట్ల రికార్డ్ బిజినెస్
Balagam: ఓటీటీలో దిమ్మతిరిగే రికార్డ్.. జోరు జోరుగా.. బలంగం
RRR పై ప్రియాంక కామెంట్ !! చెర్రీ, తారక్ ఫ్యాన్స్ సీరియస్ !!