వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఎగబడిన జనం

Updated on: Jul 20, 2023 | 4:27 PM

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.. ఇదిలా ఉండగా.. మచిలీపట్నంలో గ్యాప్ లేకుండా భారీ వర్షం కురవడంతో పలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు నిలవడంతో జనజీవనం స్తంభించింది.