Topi Amma: తమిళనాడులో టోపీ అమ్మ.. దర్శనం కోసం భక్తులు బారులు.!

|

Apr 01, 2024 | 11:47 AM

ఆమె ఒక మతి స్థిమితం లేని మహిళ. తలపై టోపీతో మాసిన దుస్తులతో దర్శనమిస్తుంది. అసలు ప్రపంచంతో సంబంధం లేదన్నట్లు తన పనితాను చేసుకుంటూ పోతుంది. అయితే ఆమెను దైవంగా భావించి పూజలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఆమె నీడ పడడమే మహా భాగ్యంగా భావిస్తున్నారు. ఆమెకు టోపీ అమ్మగా పేరు కూడా పెట్టుకున్నారు. ఇంతకీ ఎవరీ టోపీ అమ్మ?

ఆమె ఒక మతి స్థిమితం లేని మహిళ. తలపై టోపీతో మాసిన దుస్తులతో దర్శనమిస్తుంది. అసలు ప్రపంచంతో సంబంధం లేదన్నట్లు తన పనితాను చేసుకుంటూ పోతుంది. అయితే ఆమెను దైవంగా భావించి పూజలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఆమె నీడ పడడమే మహా భాగ్యంగా భావిస్తున్నారు. ఆమెకు టోపీ అమ్మగా పేరు కూడా పెట్టుకున్నారు. ఇంతకీ ఎవరీ టోపీ అమ్మ? తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం. తిరువణ్ణామలై పర్వతాల్లో కొలువై ఉన్న ఈ ఆలయం గిరి ప్రదిక్షణలకు పెట్టింది పేరు. ఇక్కడే ఉంటుందీ టోపీ అమ్మ. అరుణాచలం వీధుల్లో నివసిస్తూ, ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తుంది. ఇక్కడి భక్తులు ఈమెను అవధూతగా భావించి పూజిస్తుంటారు. ఆమె తాగి పడేసిన టీ కప్పును మహా ప్రసాదంగా భావిస్తుంటారు. ఆమె ఎవరితో మాట్లాడదు… అయినా అంతా ఆమె వెంట పడతారు. ఎంత అమూల్యమైన వస్తువును ఇచ్చినా ఆమె విసిరిపారేస్తుంది. సాయంత్రం అయితే చాలా యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో దర్శనమిస్తుంది. అక్కడ ప్రజలు ఆమె దర్శనం కోసం బారులు తీరుతుంటారు. అయితే మతిస్థిమితం లేని ఈ మహిళను ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారనే దాని వెనక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.

స్థల పురాణం ప్రకారం.. కన్యాకుమారిలో మరియమ్మ అనే మహిళ ఉండేది. కారు టైర్‌ కింద పడిపోయిన ఒక కుక్క పేగులన్నీ బయటకు వచ్చేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా, ఆమె ఆ పేగులను చేతితో కడుపులోకి నెట్టి ఆ కుక్కకు ప్రాణం పోసిందని.. అప్పటి నుంచి ప్రజలు ఆమెను దేవతగా పూజిస్తున్నట్టు స్థల పురాణం. అయితే కొన్నేళ్ల తర్వాత ఆమె మరణించి మళ్లీ టోపీ అమ్మగా జన్మించిందని కొందరు విశ్వాసం. అంతేకాదు, కొన్నేళ్ల క్రితం అరుణాచలం వచ్చిన ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా టోపీ అమ్మ అనుగ్రహం పొందగానే ఆ సమస్య తగ్గిపోయిందని దీంతో టోపీ అమ్మను దైవంగా భావించి కొలుస్తున్నట్టు మరో కథ ప్రచారంలో ఉంది. ఇక టోపీ అమ్మ ప్రతీ రోజు కచ్చితంగా గిరి ప్రదిక్షణలు చేస్తుంది. ఆమె ఇప్పటి వరకు ఆమె వేల సార్లు గిరి ప్రదిక్షణలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆమెను దేవతగా భావిస్తూ పూజిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..