Viral Video: డ్రైనేజ్‌ క్లీన్‌ చేసిన పోలీసులు.. ప్రశంసలు కురిపిస్తున్న జనం.. వీడియో.

|

Sep 09, 2023 | 6:39 PM

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వరద నీటితో కొట్టుకొచ్చిన చెత్త, చెదారం రోడ్డుమీద ఉన్న మ్యాన్‌హోల్‌ వద్ద చిక్కుకుపోవడంతో నీరు నిలిచిపోయింది. దాంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు ఆ చెత్తను క్లీన్‌ చేశారు. ఈ ఘటన టోలీచౌక్‌ ఫ్లైఓవర్‌ వద్ద చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వరద నీటితో కొట్టుకొచ్చిన చెత్త, చెదారం రోడ్డుమీద ఉన్న మ్యాన్‌హోల్‌ వద్ద చిక్కుకుపోవడంతో నీరు నిలిచిపోయింది. దాంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు ఆ చెత్తను క్లీన్‌ చేశారు. ఈ ఘటన టోలీచౌక్‌ ఫ్లైఓవర్‌ వద్ద చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియోను ట్రాఫిక్‌ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అదిచూసి ప్రజలు ట్రాఫిక్‌ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. ట్రాఫిక్‌ సౌత్‌ అండ్‌ వెస్ట్‌ జోన్‌ ఏసీపీ ధనలక్ష్మి, మరో పోలీసుతో కలిసి మ్యాన్‌హోల్‌ వద్ద నిలిచిపోయిన చెత్తను చేతులతో శుభ్రం చేశారు. మూసుకుపోయిన డ్రెయిన్‌ వల్ల ఆ ప్రాంతంలో రోడ్డుపై వరద నీరు నిలిచి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుండటంతో స్వయంగా ఏసీపీనే రంగంలోకి దిగి చెత్త క్లియర్‌ చేశారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 3 లక్షలమంది వీక్షించారు. వేలాదిమంది లైక్‌ చేశారు. వందల్లో రీట్వీట్‌ చేస్తూ.. ప్రశంసల కామెంట్లు కురిపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..