చూసి తీరాల్సిన రిచ్ కంట్రీ ఏడుగురే ఖైదీలు.. వంద మంది పోలీసులు

Updated on: Oct 27, 2025 | 3:05 PM

ప్రపంచంలో నానాటికీ శాంతి కరువవుతోంది. గొప్ప దేశాలని చెప్పుకునే పలు దేశాల్లోనూ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. అగ్రదేశంగా చెప్పుకునే అమెరికాలోనే ఏకంగా 20 లక్షల మంది నేరగాళ్లు జైలు ఊచలు లెక్కపెడుతున్నట్లు ఆ దేశ గణాంకాలు చెబుతున్నాయి. ఇక 17 లక్షల మంది ఖైదీలతో రెండో స్థానంలో చైనా ఉండగా, 5 లక్షల మందితో మన దేశం మూడో స్థానంలో ఉంది.

అయితే.. ఓ దేశంలో మాత్రం ఏడుగురంటే ఏడుగురే ఖైదీలు ఉన్నారంటే నమ్మగలమా.. ఎందుకంటే అక్కడ నేరాలు చేసేవారే ఉండరట. రాత్రపూట కూడా అక్కడి ఇళ్లకు తాళాలు వేయరంటే అక్కడి ప్రజల జీవన విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యూరప్ ఖండంలోని ఆస్ట్రియా – స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఉన్న చిన్ని దేశం పేరు “లిక్టన్‌స్టైన్‌”. ఈ దేశ జనాభా సుమారు 30 వేలు. ఈ దేశం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. పర్వతాల మధ్యన కేవలం 160 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. మధ్యయుగాల నాటి నిర్మాణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సంపద చూసుకొని బిల్డప్‌లతో ఫోజులు కొట్టడాన్ని ఆ దేశ పౌరులు అస్సలు ఇష్టపడరు. పైగా అలా చేయటం అవమానంగా భావిస్తారు. ప్రపంచంలోనే రిచెస్ట్​ దేశాల్లో ఒకటిగా ఉన్న ఈ దేశంలో సిట్జర్లాండ్‌ కరెన్సీ ఫ్రాంక్‌ ను వినియోగిస్తారు. ఇక్కడి జనమంతా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడటంతో.. ఈ దేశానికి తనకంటూ ఒక జాతీయ భాష అనేదే లేదు. మెజారిటీ జనం.. జర్మన్ భాషనే మాట్లాడుతారు. మరో ఆసక్తికర అంశం ఏమంటే ఈ రిచెస్ట్ కంట్రీలో ఒక్క ఎయిర్​ పోర్టు కూడా లేదు. అయినా.. ఈ దేశానికి టూరిజం, ఐటీ, నిర్మాణ రంగాల నుంచి బోలెడంత ఆదాయం వస్తుంది. ఆ దేశ ప్రజలు ఎదుటి వారిని మనస్పూర్తిగా గౌరవిస్తారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. డబ్బుకన్నా మానవ సంబంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే అక్కడ నేరాలు చాలా అరుదు. అక్కడ పోలీసులు కూడా అతి తక్కువ మందే ఉంటారు. అక్కడి పోలీసుల సంఖ్య కేవలం 100 మంది మాత్రమే. జనం డబ్బు సంపాదించడం, పోగొట్టుకోవడం అనే విషయాలను పక్కన పెట్టి, తమకు నచ్చిన ప్యాషన్ ఎంచుకొని ప్రశాంతంగా, ఆనందంగా జీవిస్తుంటారు. దొంగలభయం కూడా లేకపోవటంతో జనం తలుపులు కూడా వేసుకోకపోవటం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో కర్పూరంతో ఇలా చేయండి.. ఫలితం మీరే చూడండి

దేవుడి ప్రసాదాన్ని దొంగిలిస్తారు.. ఎక్కడంటే

క్రెడిట్‌ స్కోర్‌ ఎంతకీ పెరగట్లేదా ?? ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి

అంధులకు కంటిలో చిప్‌ .. టెక్నాలజీ ద్వారా చూపు

కిచెన్‌లో ఏఐ అసిస్టెంట్‌క్షణాల్లో కావాల్సిన రెసిపీ రెడీ