కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను కొండగట్టు అంజన్నే కాపాడారని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ మండపానికి పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు. టీటీడీ.. 35 కోట్ల 19 లక్షల రూపాయిల నిధులతో 100 గదులు ఉండేలా ధర్మశాలను నిర్మించేందుకు నిర్ణయించింది. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలన్నారు పవన్. కొండగట్టు తనకు పునర్జన్మను ఇచ్చిందన్నారాయన. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డానో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుందన్నారు పవన్. కొండగట్టు అంజన్నే తనను కాపాడారని చెప్పారు. టీటీడీ, తెలంగాణ నేతల సమిష్టి కృషితోనే ధర్మశాల నిర్మాణం విషయంలో ముందడుగు పడిందని పవన్ అన్నారు. భక్తుల బలమైన సంకల్పంతో ఇది సాధ్యమైందని తెలిపారు. అంతకు ముందు అలయ మర్యాదలతో పవన్‌కు అధికారులు స్వాగతం పలికారు. పూజల అనంతరం పవన్ కల్యాణ్ బృందావనం రిసార్ట్‌లో సర్పంచ్‌లు, జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :