Ambulance doors: దారుణం.. అంబులెన్సు డోర్లు తెరుచుకోక ..వ్యక్తి మృతి.. ఎక్కడంటే..?
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.. అంబులెన్స్ డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.. అంబులెన్స్ డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటు చేసుకుంది. కోజికోడ్‌లో స్కూటర్ నడుపుతూ కోయమన్ అనే 66 ఏళ్ల వ్యక్తి.. కిందపడిపోయాడు. ఆయనకు తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. వేగంగా ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ.. అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. అంబులెన్స్ సిబ్బంది, బాధితుడి బంధువులు అరగంటకుపైగా సుత్తితో కొట్టినా అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. అప్పటికే క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Sep 04, 2022 09:47 AM
