Passengers push Airplane: రన్‌వేపై విమానాన్ని నెడుతున్న జనం.. పడి పడి.. నవ్వుకుంటున్న నెటిజన్లు..(వీడియో)
మీకొక విచిత్రమైన సంఘటన గురించి చెప్పబోతున్నాం.. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేల నవ్వుకుంటున్నారు. అసలేం జరిగింది.. ఆ వీడియోలో ఏముందో మీరూ చూసేయండి..
కారు ఏదైనా ట్రబులిచ్చి స్టార్ట్ కాకపోతే వెనకనుంచి కొంతమంది వ్యక్తులు దానిని నెడతారు. అలా కొంత దూరం నెట్టాక కారు స్టార్ట్ అవుతుంది. ఇది సర్వసాధారణం. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు రన్‌వేపై విమానాన్ని నెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. విమానాన్ని నెట్టడం ఎంటంటూ అవాక్కవుతున్నారు. ఈ వింత ఘటన డిసెంబరు 1న నేపాల్‌లోని ఓ విమానాశ్రయంలో జరిగింది. నేపాల్ వార్తల ప్రకారం.. తారా ఎయిర్ సంస్థకు చెందిన విమానం.. కోల్టీలోని బజురా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం వెనుక టైర్ పేలిపోయింది. దాంతో విమానం రన్‌వే నుంచి టేకాఫ్ కాలేదు. దీంతో టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న మరో విమానానికి ఇది అడ్డుగా ఉండటంతో అది పైకి ఎగరలేకపోయింది. దీంతో విమానాశ్రయంలోని ప్రయాణికులు, భద్రతా సిబ్బందితో కలిసి విమానాన్ని రన్‌వే నుంచి క్లియర్ చేశారు. దీంతో ఇతర విమానాల రాకపోకలు జరిగినట్లు పేర్కొన్నారు.ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఇది నేపాల్ లో మాత్రమే నంటూ వ్యంగంగా కామెంట్ చేశారు. కాగా.. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తారా ఎయిర్ ఏటీ ఎయిర్‌లైన్స్ చెందిన 9N-AVE విమానం హుమ్లాలోని సిమ్‌కోట్ నుంచి బజురా విమానాశ్రయంలో దిగినట్లు హిమల్ కమ్యూనికేషన్స్‌కు ఏతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సురేంద్ర బర్తౌలా తెలిపారు. అయితే దాని టైర్ పగిలిపోవడంతో రన్ వేపై అడ్డుగా ల్యాండ్ అయిందని పేర్కొన్నారు. దీని కారణంగా మరొక విమానం పైకి ఎగరలేదని.. పక్కకు తొలగించేందకు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రయాణికులు, సిబ్బందితో దానిని క్లియర్ చేసినట్లు తెలిపారు. అయితే.. ల్యాండ్ అయిన కొంత సేపటికి విమానం టైర్ పంక్చర్ అవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు.