వందే భారత్ రైళ్లలో స్నాక్స్ ట్రేలపై ఎందుకు కూర్చొంటున్నారు ??

|

Nov 25, 2023 | 9:21 PM

భారత రవాణా వ్యవస్థలో రైల్వే చాలా కీలకమైంది. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ క్రమంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా రైళ్లను సైతం రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. వందే భారత్‌ రైళ్ల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు మరింత వేగంగా చేరుస్తోంది. దేశంలో విప్లవాత్మకమైన ప్రాజెక్టుగా వందే భారత్‌ ఎక్స్‌ప్రైస్‌ రైళ్లను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

భారత రవాణా వ్యవస్థలో రైల్వే చాలా కీలకమైంది. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ క్రమంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా రైళ్లను సైతం రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. వందే భారత్‌ రైళ్ల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు మరింత వేగంగా చేరుస్తోంది. దేశంలో విప్లవాత్మకమైన ప్రాజెక్టుగా వందే భారత్‌ ఎక్స్‌ప్రైస్‌ రైళ్లను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేస్తూ.. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుస్తోంది. అయితే రకరకాల కారణాలతో ఇటీవల కొన్ని సందర్భాలలో వందే భారత్‌ రైళ్లు పలు విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాయి. తాజాగా వందే భారత్‌ రైలుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రైలులో పరిశుభ్రత లోపించడం, సరిగా లేని ఆహారం తదితర విషయాలపై ప్రతిరోజూ రైల్వే అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా రైల్వే అధికారి ఒకరు ప్రయాణికులపై ఆరోపణలు చేశారు. అనంత్ రూపనగుడి అనే రైల్వే అధికారి ఇద్దరు చిన్నారుల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వందే భారత్, ఇతర రైళ్లలో స్నాక్ ట్రేలు విరిగిపోవడానికి లేదా పాడైపోవడానికి చిన్నారులే ప్రధాన కారణమని ఆరోపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనాలో అంతుబట్టని మరో మహమ్మారి..చిన్నారుల పాలిట

కోనసీమ శ్రీనివాసుడు కోటీశ్వరుడే.. 34 రోజులకు గాను హుండీ ఆదాయం !!