Oasis School Kids Carnival: అదరహో అనిపించిన ఒయాసిస్ కిడ్స్ కార్నివాల్.! వీడియో వైరల్.
ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే సమయం దొరకడం అరుదైపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు, వ్యాపార లావాదేవీలతో బిజీ అయిపోతున్నారు. ఈక్రమంలో పిల్లలకోసం సమయం కేటాయించలేకపోతున్నారు. అంతేకాదు పిల్లలు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన శంషాబాద్‌లోని ఒయాసిస్ స్కూలు యాజమాన్యం పిల్లలు, తల్లిదండ్రులకు మధ్య వారధిలా నిలిచింది.
ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే సమయం దొరకడం అరుదైపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు, వ్యాపార లావాదేవీలతో బిజీ అయిపోతున్నారు. ఈక్రమంలో పిల్లలకోసం సమయం కేటాయించలేకపోతున్నారు. అంతేకాదు పిల్లలు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన శంషాబాద్‌లోని ఒయాసిస్ స్కూలు యాజమాన్యం పిల్లలు, తల్లిదండ్రులకు మధ్య వారధిలా నిలిచింది. వీరిద్దరూ కలిసి కొంత సమయాన్ని గడిపేలా ప్రతిఏటా కిడ్స్ కార్నివాల్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తమ పిల్లల్లోని ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించేలా వారిని మరింత ప్రోత్సహించేలా అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాదికూడా తల్లిదండ్రులు-విద్యార్ధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది ఒయాసిస్ స్కూల్. కిడ్స్ కార్నివాల్ కార్యక్రమం ద్వారా విద్యార్ధులు, తల్లిదండ్రులకు విజ్ఞానంతోపాటు, వినోదాన్ని అందించారు. తమ పిల్లలలోని ప్రతిభను ఈ వేదికద్వారా ప్రదర్శించి తల్లిదండ్రులు గుర్తించేలా చేశారు. విద్యార్ధులు వేసిన హ్యాండ్ క్రాఫ్ట్, పెయింటింగ్స్ సహా ఏఐ గేమ్స్, రోబోట్స్ ఆకట్టుకున్నాయి. విద్యార్ధుల ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు సైతం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని నృత్యం చేశారు. పిల్లలతో కలిసి పేరెంట్స్ చేసిన డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మ్యూజిక్ షో, ఫన్ జోన్, మ్యాజిక్ షో, కార్టూన్ క్యారెక్టర్స్ తో కిడ్స్ కార్నివాల్ సందడిగా సాగింది. విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులు సైతం ఈ కార్యక్రమం ద్వారా అన్నీ మరిచి ఆనందంగా గడిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..