క్లౌడ్ సక్ తో మేఘంలోకి వెళ్లిన పారాగ్లైడర్‌.. భయానక అనుభవం ఎలా ఉందంటే

Updated on: Jun 06, 2025 | 6:28 PM

పారాగ్లైడర్ ఒకరు గాలికి కొట్టుకుపోయి ప్రమాదవశాత్తు 27,800 అడుగుల ఎత్తులోని మేఘాల్లోకి దూసుకెళ్ళి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడిన భయానక ఘటన చైనాలో జరిగింది. పారాగ్లైడింగ్ శిక్షకుడిగా పని చేస్తున్న 55 ఏళ్ల పెంగ్ యుజియాంగ్ పారాగ్లైడింగ్‌కి సంబంధించిన కొత్త ఎక్విప్‌మెంట్‌ను పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని ప్రభుత్వ మీడియా పేర్కొంది.

సామగ్రి టెస్టింగ్‌లో భాగంగా కిలియాన్ పర్వతాల మీదుగా సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో పెంగ్‌ ఎగురుతున్నారు. అకస్మాత్తుగా ఏర్పడిన ‘క్లౌడ్ సక్’ లేదా గాలి ప్రవాహం ఆయనను ఒక్కసారిగా మరో 5,000 మీటర్లు ఎత్తులోని ఒక మేఘంలోకి లాక్కెళ్లిపోయింది. శనివారం జరిగిన ఈ ఘటన, పెంగ్ నడిపిన గ్లైడర్‌కు అమర్చిన కెమెరాలో రికార్డైంది. చైనా వెర్షన్ టిక్‌టాక్ అయిన డౌయిన్‌లో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అవుతోంది. గ్లైడర్ కంట్రోల్స్‌ను పెంగ్ పట్టుకుని ఉండగా ఆయన ముఖంతో పాటు శరీరమంతా మంచుతో కప్పబడినట్లు దృశ్యాలు చూపుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పులితో సెల్ఫీకి ట్రై చేశాడు.. ఇంతలోనే షాక్

ఇంట్లో.. పక్షి గూడు కడితే శుభమా.. అశుభమా ??

చుట్టుముట్టిన అడవి పందులు.. దిమ్మదిరిగే షాకిచ్చిన చిరుత

ఆడుకుంటూ కింద పడ్డ బాలుడు.. మెదడులోకి చొచ్చుకెళ్లిన మేకు.. తర్వాత..

చోరీ కేసులో అరెస్టయిన వ్యక్తి… అతని కథ విని షాకయిన పోలీసులు