నోరు మూయలేక ఇబ్బందిపడ్డ యువకుడు.. దేవుడిలా వచ్చి

Updated on: Oct 22, 2025 | 4:56 PM

కేరళలోని పాలక్కాడ్‌ రైల్వే స్టేషన్‌లో ఓ యువకుడికి ఊహించని అనుభవం ఎదురైంది. దవడ ఎముక కిందికి జారి నోరు మూయలేక ఇబ్బందిపడుతూ రైల్వే స్టేషన్‌లో కూర్చుండిపోయాడు. యువకుడి పరిస్థితిని కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసారు. పోస్ట్‌ చూసి విషయం తెలుసుకున్న ఓ రైల్వే డాక్టర్‌.. వెంటనే వచ్చి ప్లాట్‌ఫాం పైనే చికిత్స చేసి, ఉపశమనం కలిగించారు.

ఈ రోజుల్లో కొందరు డాక్టర్లు ధనార్జనే ధ్యేయంగా వైద్యాన్ని వ్యాపారంగా మార్చేశారు. ‘వైద్యో నారాయణ హరి’ అని నమ్మి గంపెడాశతో వారి వద్దకు వచ్చే రోగులను లూటీ చేస్తున్నారు. అయితే మరికొందరు వైద్యులు మాత్రం ఓ వైపు వైద్య వృత్తిని కొనసాగిస్తూనే.. సమాజానికి తమ వంతుగా వివిధ రకాల సాయం అందిస్తూ సమాజంలోని రుగ్మతలకు సైతం చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ సేవలందిస్తున్నారు. అలాంటి వైద్యుడే పాలక్కాడ్‌ రైల్వే డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ DMO డాక్టర్‌ జితిన్‌ అనే చెప్పాలి. అసలేం జరిగిందంటే.. కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్‌ వెళ్లే వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కడానికి 24 ఏళ్ల యువకుడు ఆదివారం కేరళలోని పాలక్కాడ్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. నోటిని మూయలేక అవస్థ పడుతూ అలాగే ప్లాట్‌ఫాంపై కూర్చుండిపోయాడు. కొందరు ఆ యువకుడి పరిస్థితిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అది చూసిన పాలక్కాడ్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ DMO డాక్టర్‌ జితిన్‌ వెంటనే ఆ యువకుడి వద్దకు వచ్చి.. చేతులతోనే దవడను సరి చేశారు. దవడ ఎముక జారడం వల్ల వచ్చే ఈ సమస్యను వైద్య పరిభాషలో టెంపోరోమాండిబ్యులర్‌ జాయింట్ (టీఎంజే) అంటారని తెలిపారు. ఆవలించేటప్పుడు నోరు ఎక్కువగా తెరవడం వల్ల ఒక్కోసారి ఇలా అవుతుందని చెప్పారు. ఈ ఘటనను దక్షిణ రైల్వే ‘ఎక్స్‌’లో పోస్టు చేయడంతో పలువురు డాక్టర్‌ జితిన్‌ను అభినందించారు. సదరు యువకుడు వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపి.. వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Pothineni: ఒక్క రాత్రిలో జీరోకు వచ్చేశాం.. కానీ ఆ తరువాత..

మీ కూతురు జైల్లో ఉంది.. ఫేక్ కాల్‌ను తిప్పికొట్టిన తండ్రి

సంక్రాంతి బరిలో పెరుగుతున్న పోటీ.. రేసులో ఉన్న సినిమాలేంటి ??

ఏఏ 22 ఎందుకంత స్పెషల్‌ ?? హాలీవుడ్ స్థాయిలో బజ్‌

కొత్త దారిలో స్టార్ వారసులు.. దర్శకులుగా మారుతున్న స్టార్ కిడ్స్‌