తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఓ మహిళ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మహిళా విభాగం హెచ్చరికల నేపథ్యంలో సైన్యం ఈ ప్రవేశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆమె వాదనలు ఏమైనా, ఉద్దేశపూర్వక చొరబాటా లేదా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగిన వేళ ఈ ఘటన భద్రతా ఆందోళనలు పెంచింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఓ మహిళ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ఆమె అనుకోకుండా భారత్‌లోకి ప్రవేశించిందా? ఉద్దేశపూర్వకంగా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది సైన్యం. ఎందుకుంటే ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మహిళా విభాగం ఏర్పాటు చేసింది . మహిళలకు జీహాదీలుగా ట్రైనింగ్ ఇచ్చి భారత్‌లో దాడులకు ప్రయత్నిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది. ఈ సమయంలో ఆ మహిళ దేశంలోకి చొరబడటంతో సైన్యం అప్రమత్తమైంది. మహిళను పాకిస్థాన్‌లోని కోట్లి ప్రాంతానికి చెందిన షెహ్నాజ్ అక్తర్ గా గుర్తించారు. సరిహద్దులోని బాలాకోట్ సెక్టర్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె తన తండ్రితో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి ఎల్ఓసీ మీదుగా భారత్‌లోకి ప్రవేశించినట్లు చెప్పింది. విచారణ తర్వాత ఆ మహిళను పోలీసులకు అప్పగించనుంది సైన్యం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎల్‌ఓసీ వెంబడి మళ్లీ ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. లష్కరే, జైషేలకు చెందిన అనేక యూనిట్లు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, పాకిస్థాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ సాయంతో చొరబాటు మార్గాల ద్వారా కశ్మీర్‌లోకి ప్రవేశించాయని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంత న్యూ ఇయర్ రిజల్యూషన్ పోస్ట్ వైరల్.. తప్పులు దిద్దుకుంటా
Himalayas: మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ. 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు