Natu Natu Song: పాకిస్థాన్ లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ మానియా.. నాట్ నాటు పాటకు చిందులేసిన పాక్ నటి..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ కి యావత్ ప్రపంచం ఫిదా అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ పాటకు స్టెప్స్ వేసేందుకు ఉత్సాహం ప్రదర్శించిన వారే. గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న ఈ పాట, ఇప్పుడు ఆస్కార్ అవార్డుల బరిలోనూ నిలిచింది.ఇక ఈ నాటు నాటు పాట మేనియా దాయాది దేశమైన పాకిస్థాన్ కూ పాకింది. ప్రముఖ పాకిస్థానీ నటి హానియా ఆమిర్ సైతం నాటునాటు పాటకు డ్యాన్స్ ఇరగదీసింది. ఓ వివాహ వేడుకలో భాగంగా కుర్రాడితో కలసి హానియా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ కు చెందిన ఓ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. వివాహానికి అతిథిగా వచ్చిన హానియా తన డ్యాన్స్ తో అక్కడి వారిని ఆకట్టుకుంది. దీంతో పెళ్లి వేదిక ఉత్సాహంగా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు. ‘‘ఇది డ్యాన్సా లేక ఎక్సర్ సైజ్ సెషనా? అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కాగా భారత సినిమాల పట్ల హానియా తన ప్రేమను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!