Orangutan smoking: అచ్చం మనిషిలాగే సిగరెట్ తాగిన ఒరెంగుటాన్.. వైరల్ అవుతున్న వీడియో..
ఒరెంగుటాన్లు చూడడానికి అచ్చం చింపాజీలను పోలి ఉంటాయి. ఇక ప్రవర్తనలో అయితే మనుషుల్లాగే బిహేవ్ చేస్తుంటాయి. సందర్శకులు ఇచ్చిన ఆహార పదార్థాలు తినడంతో
ఒరెంగుటాన్లు చూడడానికి అచ్చం చింపాజీలను పోలి ఉంటాయి. ఇక ప్రవర్తనలో అయితే మనుషుల్లాగే బిహేవ్ చేస్తుంటాయి. సందర్శకులు ఇచ్చిన ఆహార పదార్థాలు తినడంతో పాటు బాధ కలిగినప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తాయి. అందుకే వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిని చూసిన జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీడియోలో ఒరెంగుటాన్ పొగరాయుడిలా మారిపోయింది. మనిషిలాగా తాపీగా కూర్చోని సిగరెట్ తాగింది. ఇదే యానిమల్ లవర్స్, నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. అసలే అంతరించిపోయే దశలో ఉన్న ఒరెంగుటాన్లకు సిగరెట్ ఎలా దొరికింది? జూ నిర్వాహకులు ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.వియత్నాంలోని హోచిమిన్ సిటీలోగల సైగాన్ జూ, బొటానికల్ గార్డెన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో ఒరెంగుటాన్ నేలపై కూర్చొని ఉంది. అచ్చం మనిషిలాగే రెండు వేళ్లతో పట్టుకుని సిగరెట్ తాగుతోంది . అయితే జూ సందర్శకుడు పడేసిన సిగరెట్‌ను ఒరెంగుటాన్ తీసుకొని తాగిందని, జూ సిబ్బంది దానికి సిగరెట్ ఇవ్వలేదని జూ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో బాగా చక్కర్లు కొడుతోంది. ‘అసలే ఒరెంగుటాన్లు అంతరించిపోయే జీవజాతుల జాబితాలో ఉన్నాయి. అలాంటి స్థితిలో వాటికి సిగరెట్లు ఎలా అందిస్తారు. ఓ జీవిని హానికరమైన పదార్థాలకు బానిసలుగా మారుస్తారా’ అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Aliens coin: యువకుడికి దొరికిన ఏలియన్స్ నాణెం.. సోషల్ మీడియాలో కాయిన్‌పై రచ్చ..!
Priest: మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి.. ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే..
Runner @105: రన్నర్@105.. రాంబాయి రూటే సపరేటు.. వీడియో చుస్తే మెచ్చుకోవడం ఖాయం..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

