మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!

Updated on: Dec 13, 2025 | 1:47 PM

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న గొడవలు కూడా వివాహ బంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. గుజరాత్‌లో ఉల్లిపాయ, వెల్లుల్లి కారణంగా ఓ జంట పదకొండేళ్ల బంధాన్ని తెంచుకుంది. అహం, రాజీ లేకపోవడమే ఈ విడాకులకు ప్రధాన కారణం. సంసారంలో సర్దుకుపోవడం, అవగాహన కీలకం. లేదంటే ఇలాంటి చిన్న విషయాలే కాపురాలు కూల్చేస్తాయి.

ప్రస్తుత కాలంలో వివాహ బంధానికి విలువ లేకుండా పోతుందా అనిపిస్తోంది. చిన్న విషయాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంసారంలో చిన్న చిన్న గొడవలు సహజం. భార్య,భర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు సర్ధుకుపోతే సంసారం సజావుగా ప్రశాంతంగా కొనసాగుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అని ఈగోలకు పోతే ఇదిగో..ఇలాగే కాపురాలు కూలిపోతాయి. కేవలం ఉల్లి వెల్లుల్లి కారణంగా పదకొండేళ్లు కలిసి కాపురం చేసిన దంపతులు విడిపోయారు. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ జంటకు 2002లో వివాహం జరిగింది. భార్య వేరే వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఉల్లిపాయ, వెల్లుల్లి తినేది కాదు. ఇంట్లోనూ వాటిని వాడొద్దని తరచూ కుటుంబ సభ్యులకు చెప్పేది. అందుకు కుటుంబ సభ్యులు నిరాకరించేవారు. దీంతో వారిమధ్య తరచూ గొడవలు తలెత్తేవి. ఈ క్రమంలో కుటుంబసభ్యుల మధ్య దూరం పెరిగింది. ఆమె మాటకు విలువలేదని, తనకు గౌరవం లేదని భావించిన ఆమె భర్తను, కుమారుడిని వదిలి వెళ్లిపోయింది. ఇంటికి రావాలని భర్త ఎన్నిసార్లు పిలిచినా ఆమె ససేమిరా అంది. దాంతో భర్త విడాకులు కావాలని 2013లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. భార్య ఆ తీర్పును సవాలు చేస్తూ గుజరాత్‌ హైకోర్టులో అప్పీలు చేసింది. తాజాగా ఆమె పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా విశ్రాంతి మాటేంటి ?? ప్రశ్నిస్తున్న లోకోపైలట్లు

జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి

ఆ దేశం లో టీనేజర్లకు సోషల్‌ మీడియాను బ్యాన్‌.. ఎందుకో వీడియో తెలుసుకోండి

అరబ్ దేశాలకు చైనా ఊహించని షాక్‌.. సముద్రపు నీటితో ఫ్యూయల్‌ తయారీ

పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..