300 అడుగుల ఎత్తులో తలకిందులుగా ఉద్యోగి.. చివరకు..

Updated on: Apr 26, 2025 | 10:14 AM

విండ్ పవర్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసే గాలి మరల దగ్గర ఉద్యోగం ఎంత ప్రమాదకరమో చూపించే సంఘటన అది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్ వద్ద గాలి మరలు మెయింటెనెన్స్ చేసే ఉద్యోగికి పెను ప్రమాదం తప్పింది. కొన్ని వందల అడుగుల ఎత్తులో గాలి మరల దగ్గర మరమ్మత్తు చేస్తుండగా సుందరేశన్ అనే ఉద్యోగి ప్రమాదవశాత్తు కాలుజారి అంత ఎత్తు నుంచి కిందకు జారిపోయాడు.

అయితే ఐరన్ సేఫ్టీ రోప్ సుందరేశన్ కాలికి చుట్టుకోవడంతో…. 300 అడుగుల ఎత్తులో తలకిందులుగా గంటకు పైగా వేలాడాడు. ఐరన్ రోప్ కాలికి చుట్టుకోకపోయి ఉంటే అతను కింద పడి చనిపోయేవారు. కానీ అదృష్టం బాగుండి ఐరన్ రోప్ కారణంగా ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుతులతో పాటు.. గాలి మరలో పనిచేసే తోటి ఉద్యోగులతో సహా సహాయక చర్యలు చేపట్టారు. సుందరేసన్ తో పాటు పనిచేసే మరో ఉద్యోగి అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్ ప్రాణాలకు తెగించి మరొక ఐరన్ రోప్ సహాయంతో పైనుంచి కిందకు దిగి…. 300 అడుగుల ఎత్తున వేలాడుతున్న సుందరేసన్ వద్దకు చేరుకున్నాడు. మెల్లగా ఐరన్ రోప్‌ను వదులుతూ కిందకు దించారు. ఎట్టకేలకు అందరూ శ్రమించి సుందరేసన్‌ను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఐరన్ రోప్ కాలికి గట్టిగా చుట్టుకోవడంతో గాయాలతో అయినా సుందరేసన్ ప్రాణాలతో బయటపడ్డాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్.. కొత్త రకం డయాబెటీస్.. ఎవరికి వస్తుందో తెలుసా?

ఈత కొడుతున్న గబ్బిలం.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు

అరే.. ఎవర్రా నువ్వు.. చలివేంద్రం లో ఇదేం పనిరా.. సైలెంట్ గా వచ్చి..

రోడ్డు మధ్యలో ప్రత్యక్షమైన కుర్చీ.. ఆ తర్వాత ??

ఈ చేపను ముట్టుకుంటే పక్షవాతం అది విషం చిమ్మితే మరణం