Viral video: మూడు సింహాలు నిద్రిస్తున్న వేళ.. వాటిని భయపెట్టిన అడవిపంది.. ఫన్నీ వీడియో వైరల్

Viral video: అడవికి రారాజు సింహం. అలాంటి మృగరాజు సింగిల్‌ గా ఎదురైతేనే.. మిగతా జంతువులు భయంతో పరుగులు పెడతాయి. ఇక అవి గుంపుగా వస్తే సీన్‌ ఎలా ఉంటుందో...

Viral video: మూడు సింహాలు నిద్రిస్తున్న వేళ.. వాటిని భయపెట్టిన అడవిపంది.. ఫన్నీ వీడియో వైరల్
Lions Vs. Wild Boa

Updated on: Apr 10, 2021 | 2:02 PM

Viral video: అడవికి రారాజు సింహం. అలాంటి మృగరాజు సింగిల్‌ గా ఎదురైతేనే.. మిగతా జంతువులు భయంతో పరుగులు పెడతాయి. ఇక అవి గుంపుగా వస్తే సీన్‌ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సాధారణంగా సింహాలకు ఎదురెళ్లిన ఏ జంతువైనా వాటికి ఆహారంగా మారిపోవాల్సిందే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అలాంటి సింహాల గుంపుకు ఓ అడవిపంది షాక్ ఇవ్వడం సంచలనంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే..

అడవిలో ఓ మగసింహం… రెండు ఆడసింహాలు… ఓ చెట్టు కింద గాఢ నిద్రలో ఉన్నాయి. అయితే సింహాలు అక్కడ ఉన్నాయని చూడని ఓ అడవి పంది వాటివైపే పరుగెత్తుకుంటూ దూసుకొచ్చింది. ఆ పంది పరుగు శబ్దానికి నిద్రపోతున్న సింహాలు ఒక్కసారిగా అదిరిపడ్డాయి. తమపై అటాక్‌ చేసేందుకు ఎవరో వస్తున్నారనుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాయి. కాగా, అప్పటివరకూ సింహాలవైపు వేగంగా వచ్చిన అడవిపంది… సింహాలను చూడగానే షాకైంది. సింహాల గుంపు షాక్‌ నుంచి తేరుకునేలోపే అడవిపంది వేరే వైపుకు పారిపోయింది. ఇక షాక్‌లో ఉన్న సింహాలు… ఆ క్షణంలో ఏమి చేయలేక అలా చూస్తూ సైలెంట్‌గా ఉండిపోయాయి. ఈ వైరల్‌ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది.

 

Also Read: టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

దీప కండిషన్ సీరియస్.. సంతోషంలో మోనిత…. దీపని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలో కార్తీక్..