Childrens video: ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే..! హాస్టల్‌లో చిన్నారిని ఓదార్చుతున్న మరో చిన్నారి.. వైరల్ అవుతున్న వీడియో..

|

Oct 27, 2021 | 4:55 PM

చిన్నపిల్లలు దేవునితో సమానం అంటారు. వారి పసి మనసులు కల్లాకపటం లేకుండా ఉంటాయి. వారిలో స్వార్థం, ద్రోహం, మోసం, పేద, ధనిక తేడాలు వంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండవు. మనసు నిర్మలంగా.. కల్లాకపటం లేకుండా ఉంటుంది...

YouTube video player
చిన్నపిల్లలు దేవునితో సమానం అంటారు. వారి పసి మనసులు కల్లాకపటం లేకుండా ఉంటాయి. వారిలో స్వార్థం, ద్రోహం, మోసం, పేద, ధనిక తేడాలు వంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండవు. మనసు నిర్మలంగా.. కల్లాకపటం లేకుండా ఉంటుంది. అందరితో కలిసి పోతారు.. త్వరగా స్నేహం చేస్తారు.. ఆ వయసులో జాలి, దయ, కరుణ మాత్రమే ఉంటాయి. వారి స్నేహం కూడా అంతే నిష్కల్మషంగా ఉంటుంది. ఇక చిన్నారుల్లో స్నేహం ఎంత నిజాయతీగా ఉంటుందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. హాస్టల్‌కి వెళ్లిన ఓ చిన్నారి అమ్మ గుర్తుకువచ్చి ఏడుస్తాడు. అది చూసి వాడి స్నేహితురాలు ఏడవొద్దంటూ ఓదారుస్తుంది. ఈ చిన్నారుల క్యూట్‌ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రసుత్తం తెగ వైరలవుతోంది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఈ సంఘటన జరిగింది. అమ్మ గుర్తుకొచ్చి ఏడుస్తున్న ఓ చిన్న పిల్లాడిని స్నేహితురాలు దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంది. ‘‘అరే ఏడవకురా.. ఊర్కో. అమ్మ గుర్తుకు వస్తుందా.. ఏడవకు.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’’ అంటూ తనకు తోచిన రీతిలో తన స్నేహితుడిని ఓదారుస్తుంది. ‘‘ప్రేమ అనేది మానవుల సహజ లక్షణం..అలవాటు చేసుకుంటే అయ్యేది కాదు. ప్రేమ విశ్వవ్యాప్తం.. దానికి ఎంతో శక్తి ఉంది. ప్రేమిస్తూ ఉండండి.. హాస్టల్‌లో ఉన్న ఈ ఇద్దరు చిన్నారులు ఒకరినొకరు ఎలా ఓదార్చుకుంటున్నారో చూడండి’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ఎంత క్యూట్‌గా ఉన్నారో.. నాకు నా బాల్యం గుర్తుకు వచ్చింది. ఎంత అందమైన బంధమో కదా అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

News report Viral Video: న్యూస్‌ ఛానల్‌ వెదర్‌ రిపోర్ట్‌ మధ్య నగ్న వీడియో..! షాక్ లో యాంకర్.. సంచలనంగా మారిన క్లిప్..