ఇంతకు ముందు ఎవరూ చూడని కొత్త రంగు ‘ఓలో’ కనిపించిందోచ్‌

Updated on: Apr 28, 2025 | 7:34 PM

ఇప్పటివరకు ఎవరూ చూడని కొత్తరకం రంగును అమెరికా శాస్త్రవేత్తల బృందం కనుగొన్నారు. ఇంద్రధనుస్సు రంగుల్లోకి ఓలో అదనంగా వచ్చి చేరింది. ఈ రంగు పీకాక్‌ బ్లూ లేదా టీల్‌లాగా ఉందని వారు అభివర్ణించారు. ‘సైన్స్‌ అడ్వాన్సెస్‌’ జర్నల్‌లో ఈ కథనం ప్రచురితమైంది. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ కలర్‌ను అభివృద్ధి చేశారు.

రెటీనాలోకి లేజర్‌ను ప్రసరింపజేశారు. దాంతో రెటీనా సాధారణ పరిమితికి మించి చూడగలిగేలా లేజర్‌ ప్రేరేపించింది. తద్వారా శాస్త్రవేత్తలు ఓలో రంగును చూడగలిగారు. కాలిఫోర్నియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రెన్ ఎన్జీ ఈ పరిశోధనకు సహ రచయిత. ఆయన ఈ పరిశోధనను “అద్భుతమైన”దిగా పేర్కొన్నారు. ఈ రంగు కనుగొనడం కలర్ బ్లైండ్‌నెస్‌ అంటే రంగులను సరిగా చూడలేకపోయే వారి విషయంలో చేపట్టే భవిష్యత్తు పరిశోధనలకు మార్గం చూపుతుందని ప్రొఫెసర్ ఎన్జీ అభిప్రాయపడ్డారు. ఐదుగురు శాస్త్రవేత్తల ప్రతి ఒక్కరి కనుగుడ్డులోకి లేజర్ కాంతిని పంపించి పరిశోధకులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఐదుగురిలో నలుగురు పురుషులు, ఒకరు మహిళ ఉన్నారు. వీరందరికీ సాధారణ కంటిచూపు ఉంది. ఈ అధ్యయనంలో, ‘ఓజెడ్’ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించారు. దీన్ని అద్దాలు, లేజర్లు, ఆప్టికల్ పరికరాలతో రూపొందించారు.రెటీనా అనేది మన కంటిలోని వెనుక భాగంలో ఉండే సున్నితమైన కణజాలపు పొర. ఇది కాంతిని గ్రహించి, దానిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. ఆ సిగ్నల్స్ ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడుకు చేరి మనం చూడగలగేలా చేస్తాయి. సహజంగా చూస్తే ఓలో రంగు కనిపించదు. కేవలం లేజర్‌ ప్రేరణతోనే కనిపించిన రంగు. ఓలో అనే కొత్త రంగు గురించి ఇంకా విశ్లేషించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇతనో వెరైటీ ఎలక్ట్రీషియన్‌.. ఇతని ఐడియాకి అంతా అవాక్కే

చర్మం కాంతివంతంగా ఉండాలంటే పాటించాల్సిన నియమాలు

సమ్మర్‌లో హైడ్రేట్‌గా ఉండాలంటేఎలాంటి ఫ్రూట్స్‌ తినాలి ??

స్టార్ క్రికెటర్‌కు విడాకులిచ్చి.. దిల్ రాజు సినిమా కోసం హైదరాబాద్ కు వచ్చి

Sreeleela: శ్రీలీల ఫేట్ మార్చిన ఫేస్ బుక్ పోస్ట్