Olive Ridley Turtles: సముద్ర తీరానికి క్యూకట్టిన అరుదైన తాబేళ్లు.. ఏటా సీన్ రిపీట్..

|

Mar 09, 2023 | 9:30 AM

రిడ్లే తాబేళ్లు ఒడిశా తీరం బాట పట్టాయి. ఈ సముద్ర తాబేళ్లు ఏటా సంతానోత్పత్తి కోసం ఈ సీజన్‌లో ఒడిశా తీరం చేరుకుంటాయి. ఇక్కడ సముద్ర తీరంలోకి చేరి గుడ్లు పెడతాయి. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ

రిడ్లే తాబేళ్లు ఒడిశా తీరం బాట పట్టాయి. ఈ సముద్ర తాబేళ్లు ఏటా సంతానోత్పత్తి కోసం ఈ సీజన్‌లో ఒడిశా తీరం చేరుకుంటాయి. ఇక్కడ సముద్ర తీరంలోకి చేరి గుడ్లు పెడతాయి. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పిల్లలుగా మారిన తర్వాత తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. ఏటా కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పోసంపేట నుంచి బటేశ్వర్ వరకు నాలుగు కిలోమీటర్ల పరిధిలోని తీరంలో తాబేళ్లు గుడ్లు పెట్టే కార్యక్రమం ఫిబ్రవరి 23 రాత్రి మొదలైంది. ఇందుకు సంబంధించిన తాజా వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ పేజీలో పంచుకున్నారు. ఈ వీడియోలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్రం నుంచి వడివడిగా తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నాయి. ‘‘ఏటా వచ్చే ఈ అతిథులకు ఒడిశా ఆహ్వానం పలుకుతోంది. రుషికుల్య రూకరీ వద్ద ఆలివ్ రిడ్లే తాబేళ్ల వార్షిక సామూహిక సంతానోత్పత్తి కార్యక్రమం మొదలైంది’’ అంటూ వీడియోకి కాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 2వేల మందికి పైగా వీక్షించారు. రిడ్లే తాబేళ్లకు వెల్‌ కమ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 09, 2023 09:30 AM