Olive Ridley Turtles: సముద్ర తీరానికి క్యూకట్టిన అరుదైన తాబేళ్లు.. ఏటా సీన్ రిపీట్..
రిడ్లే తాబేళ్లు ఒడిశా తీరం బాట పట్టాయి. ఈ సముద్ర తాబేళ్లు ఏటా సంతానోత్పత్తి కోసం ఈ సీజన్‌లో ఒడిశా తీరం చేరుకుంటాయి. ఇక్కడ సముద్ర తీరంలోకి చేరి గుడ్లు పెడతాయి. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ
రిడ్లే తాబేళ్లు ఒడిశా తీరం బాట పట్టాయి. ఈ సముద్ర తాబేళ్లు ఏటా సంతానోత్పత్తి కోసం ఈ సీజన్‌లో ఒడిశా తీరం చేరుకుంటాయి. ఇక్కడ సముద్ర తీరంలోకి చేరి గుడ్లు పెడతాయి. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పిల్లలుగా మారిన తర్వాత తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. ఏటా కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పోసంపేట నుంచి బటేశ్వర్ వరకు నాలుగు కిలోమీటర్ల పరిధిలోని తీరంలో తాబేళ్లు గుడ్లు పెట్టే కార్యక్రమం ఫిబ్రవరి 23 రాత్రి మొదలైంది. ఇందుకు సంబంధించిన తాజా వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ పేజీలో పంచుకున్నారు. ఈ వీడియోలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్రం నుంచి వడివడిగా తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నాయి. ‘‘ఏటా వచ్చే ఈ అతిథులకు ఒడిశా ఆహ్వానం పలుకుతోంది. రుషికుల్య రూకరీ వద్ద ఆలివ్ రిడ్లే తాబేళ్ల వార్షిక సామూహిక సంతానోత్పత్తి కార్యక్రమం మొదలైంది’’ అంటూ వీడియోకి కాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 2వేల మందికి పైగా వీక్షించారు. రిడ్లే తాబేళ్లకు వెల్ కమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

