పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! కదిలిన పూర్వ విద్యార్థుల సంఘం

|

Dec 31, 2024 | 3:34 PM

అన్నదమ్ములు కూడా ఆదుకోని ఈ రోజుల్లో ఏ రక్తసంబంధం లేని స్నేహితులు మేమున్నామంటూ స్నేహితుడి కూతురి పెళ్లికి ఆర్థిక సహాయం చేసి, అండగా నిలిచారు పూర్వ విద్యార్థులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన లవయ్య అనే పూర్వ విద్యార్థి 1988- 89 టెన్త్ క్లాస్ కరీంనగర్ లోని భారతీయ విద్యా కేంద్రంలో విద్యనభ్యసించారు. అప్పటినుంచి ఇప్పటివరకు వారంతా ఒకరికి ఒకరు మర్చిపోకుండా ఆత్మీయంగా పలకరించుకుంటున్నారు.

లవయ్య నిరుపేద వ్యక్తి. కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు, తన కూతురు స్రవంతి వివాహానికి పూర్వ విద్యార్థులను కూడా ఆహ్వానించాడు. అయితే పూర్వ విద్యార్థులు లవయ్య కూతురు వివాహానికి అండగా నిలిచారు, లక్ష రూపాయల నగదును పెళ్లి ఖర్చులకోసం అందజేసి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నప్పుడు తమలో ఎవరికి ఆపద వచ్చినా.. ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా పూర్వ విద్యార్థులు ముందు వరుసలో ఉండి ఆపన్న హస్తం అందించాలని మాటా మాటా అనుకున్నారు. వీరిని చూసి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్ తరాల వారు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని, ముందుకు సాగాలని పూర్వ విద్యార్థులను అభినందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.