ఆ బాలుడిని చూసి ఆగిపోయిన భారీ వరద

Updated on: Sep 10, 2025 | 4:49 PM

భారతదేశంలో ఊబకాయం సమస్య రోజు రోజుకీ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా దీని బారినపడుతున్నారు. ఈ ఊబకాయం కారణంగా అనేకమంది గుండెజబ్బులు, మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత వాసులు ఎక్కువగా ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఊబకాయం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు సామాజికపరంగానూ ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఉపయోగంలేని ఈ ఊబకాయంతో అన్నీ సమస్యలే. అయితే సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ ఊబకాయం వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయని నిరూపించింది ఓ మహిళ. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఓ కాలనీ మొత్తం నీటమునిగిపోయింది. వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. ఈ క్రమంలో ఓ మహిళ వేగంగా వస్తోన్న వరదనీరు ఇంట్లోకి రాకుండా తన కుమారుడిని అడ్డుగా కూర్చోబెట్టింది. ఇదేంటి కుమారుడ్ని కూర్చోబడితే వరదనీరు ఇంట్లోకి రాదా అనేగా మీ అనుమానం. ఆ మహిళ కుమారుడు ఊబకాయం కలిగిన వ్యక్తి. అతని భారీ శరీరం వరదను లోపలికి రాకుండా అడ్డుకుంది. అతను వరదనీరు ఇంట్లోకి వచ్చే ప్రదేశంలో అడ్డుగా కూర్చున్నాడు. దాంతో నీటిప్రవాహం పక్కనుంచి వెళ్లిపోయింది. ఆ బాలుడు లేకపోతే కచ్చితంగా ఆ ఇల్లు వరద నీటితో నిండిపోయేది. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. 21 వేలమందికి పైగా లైక్‌ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఎందుకూ పనికిరాదనుకునే ఊబకాయం ఇలా ఉపయోగపడింది.. అని ఒకరు.. సృష్టిలో ఉపయోగం లేనిదంటూ ఉండదు.. టైమ్‌ రావాలి అంతే అని మరొకరు కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. మంటల్లో కాలిపోతూ స్కూటీపై ఆసుపత్రికి వెళ్లిన మహిళ

Bigg Boss Telugu 9: మొదలైన ఫస్ట్ వీక్ నామినేషన్స్.. పిచ్చి పిచ్చిగా లొల్లి పెట్టుకున్న బ్యూటీలు

డాక్యుమెంటరీగా.. ప్రొద్దుటూరు దసరా సంబరం

Boney Kapoor: నన్ను రూమ్‌కి కూడా రానిచ్చేది కాదు..

కొడుకు లేడు.. కూతుళ్లు లేరు ఆ లగ్జరీ బంగ్లా నాకెందుకు ?? స్టార్‌ కపుల్‌.. షాకింగ్ నిర్ణయం!