Oarfish: సముద్ర తీరంలో వింత చేప… ఆశ్చర్యపోతున్న జనం..! ఎన్ని అడుగులో తెలుస్తే షాక్ అవుతారు..
ఈ భూగోళంలో మహా సముద్రాలు రకరకాల జాతుల చేపలు, విచిత్ర జీవులకు నిలయాలు. ఇటీవల సముద్రతీరాల్లో విచిత్రమైన జీవులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట...
ఈ భూగోళంలో మహా సముద్రాలు రకరకాల జాతుల చేపలు, విచిత్ర జీవులకు నిలయాలు. ఇటీవల సముద్రతీరాల్లో విచిత్రమైన జీవులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట… మెక్సికో తీరంలో 13 అడుగుల ఓర్ చేప కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తాజాగా అదే జాతికి చెందిన మరో ఓర్ చేప న్యూజిలాండ్‌లో దర్శనమిచ్ చింది. న్యూజిలాండ్‌లో సముద్ర తీరానికి ఈ పెద్ద చేప కొట్టుకొచ్చింది. అయితే ఇది బతికే ఉంది. ఈ చేపను మొదట స్థానిక వ్యక్తి ఒకరు చూశారు. మొదట దానిని చూసి షార్క్ ఫిష్ అనుకున్నారు. దానిని వీడియోకూడా తీసారు. కానీ అది ఓర్ ఫిష్ అని, ఇవి చాలా అరుదైన చేపలని, ఇవి ఇంకా జీవించి ఉండటం నమ్మలేని విషయం అంటున్నారు సముద్ర జీవ శాస్త్ర పరిశోధకులు.కాగా ఓర్ చేపలు చాలా పెద్దగా, పొడవు పెరుగుతాయి. న్యూజిలాండ్‌లోని అరామోనా (Aramoana) బీచ్‌కి ఈ చేప కొట్టుకొచ్చింది. అయితే ఈ ఫిస్ ఇలా ఒడ్డుకు కొట్టుకు రావడం మంచి సంకేతం కాదు అంటున్నారు డాక్టర్ అల్లన్. సముద్రంలో సమస్య వస్తేనే అవి అలా ఒడ్డుకు వస్తాయన్నారు. ఇవి మనుషుల కంట పడటం చాలా అరుదని, సముద్ర లోతుల్లోనే ఇవి ఎక్కువ సంచరిస్తాయని చెప్పారు. ఇలా ఒడ్డుకి వచ్చినప్పుడు మాత్రమే చూడగలమని అంటున్నారు. ఇవి ఎప్పుడూ మనుషులకు హాని చెయ్యలేదని తెలిపారు. ఈ చేప వీడియోని ఒటాగో యూనివర్శిటీకి చెందిన డాక్టర్ బ్రిడీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు . కాగా ఈ చేపను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రకరకాల కామంట్లు చేస్తూ వీడియోను లైక్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..
