NTR vs Ram Charan: దేవర గ్లింప్స్‌ రిలీజ్‌ అయిన వేళ.. ట్రెండింగ్‌లోకి మెగా పవర్‌ స్టార్.

Updated on: Jan 09, 2024 | 2:02 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్స్‌ దేవర గ్లింప్స్‌ రిలీజ్ అయింది. సెన్సేషనల్ అయింది. అక్రాస్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. తారక్‌ స్క్రీన్‌ ప్రజెంన్స్‌.. డైలాగ్‌ డెలవరీ అందర్లో గూస్‌ బంప్స్‌ పుట్టిస్తోంది. సినిమాపై అప్పుడే ఎక్కడ లేని అంచనాలు పెరిగేలా చేస్తోంది. కానీ కట్ చేస్తే ఈ సినిమాకు పోటీగా... మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ గేమ్ చేంజర్‌ మూవీ ట్విట్టర్లో దేవరకు మించి ట్రెండ్ అవుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్స్‌ దేవర గ్లింప్స్‌ రిలీజ్ అయింది. సెన్సేషనల్ అయింది. అక్రాస్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. తారక్‌ స్క్రీన్‌ ప్రజెంన్స్‌.. డైలాగ్‌ డెలవరీ అందర్లో గూస్‌ బంప్స్‌ పుట్టిస్తోంది. సినిమాపై అప్పుడే ఎక్కడ లేని అంచనాలు పెరిగేలా చేస్తోంది. కానీ కట్ చేస్తే ఈ సినిమాకు పోటీగా.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ గేమ్ చేంజర్‌ మూవీ ట్విట్టర్లో దేవరకు మించి ట్రెండ్ అవుతోంది. ఎస్ ! దేవర గ్లింప్స్‌ రిలీజ్ అయి.. నెట్టింట ట్రెండ్ అవుతున్న వేళ.. రామ్ చరణ్‌ గేమ్ చేంజర్ మూవీ నేమ్ కూడా.. ట్రెండ్ అవుతోంది. ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్‌ ఇద్దరూ.. పోటా పోటీగా.. ఈ రెండు మూవీ టైటిల్స్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకురావడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక దేవర మూవీ కొరటాల శివ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. అదే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ.. శంకర్ డైరెక్షన్లో… బైలింగువల్ సినిమాగా వస్తోంది. అయితే ఇప్పటి వరకు గేమ్ చేంజర్‌ నుంచి.. గ్లింప్స్‌ అప్డేట్ గానీ.. టీజర్‌ అప్డేట్ కానీ బయటికి రాలేదు. ఇక ఈక్రమంలోనే బయటికి వచ్చిన దేవర గ్లింప్స్ కారణంగా.. ఈ మూవి నేమ్‌ను కూడా .. దేవరకు పోటీగా.. ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు మెగా ఫ్యాన్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos