కప్పు ఛాయ్‌ వెయ్యి రూపాయలా? పేదవాడిలా ఫీల్ అయ్యా

Updated on: Aug 26, 2025 | 11:14 AM

ఒక్క కప్పు ఛాయ్‌ వెయ్యి రూపాయాలా? ఇండియాలో నేను పేదవాడిలా ఫీల్ అయ్యా అంటూ ఓ ఎన్నారై ఇండియాలో పెరిగిన జీవన వ్యయంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. దర్హామ్‌లలో సంపాదించే తాను కూడా ఇండియా పర్యటనలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అతని కామెంట్‌పై నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. దుబాయ్‌లో నివసించే ట్రావెల్ వ్లాగర్ పరిక్షిత్ బలోచి భారత్‌లోని ప్రధాన నగరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వీడియో ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇప్పటివరకు ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియోలో ఆయనేమన్నారంటే.. ముంబైలోని ఒక హోటల్‌లో ఒక కప్పు టీ తాగాననీ అందుకోసం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. భారత్‌లో తిరుగుతుంటే తను ఓ పేదవాడిలా ఫీల్‌ అయ్యాననీ, ఇలా జరుగుతుందని తనెప్పుడూ ఊహించలేదనీ తెలిపారు. సాధారణంగా, విదేశాల్లో సంపాదించే ఎన్నారైలకు కరెన్సీ మారకం వల్ల భారతదేశంలో ఖర్చులు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని బలోచి అన్నారు. దర్హామ్‌లను రూపాయలుగా మార్చిన తర్వాత కూడా తనకు షాక్ తగిలిందనీ గతంలో ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేదని వీడియోలో చెప్పుకొచ్చారు.. పరీక్షిత్ బలోచి అభిప్రాయంతో ఏకీభవిస్తూ నెట్టింట యూజర్లు తమ అనుభవాలను పంచుకుంటూ, ముంబై వంటి నగరాల్లో ఖర్చు ఎంత విపరీతంగాపెరిగిందో కామెంట్ల రూపంలో తెలియచేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారతీయుడ్ని పెళ్లాడా.. లైఫ్‌ ఎలా ఉందంటే.. బ్రెజిల్‌ యువతి పోస్ట్‌ వైరల్‌

ప్రైమరీ స్కూల్‌లోకి ఏనుగు పిల్ల అడ్మిషన్‌ కావాలేమో అంటున్న నెటిజన్లు