17 రోజుల్లో రూ.14.85 కోట్లు ఫట్.. డిజిటల్ అరెస్ట్ చేసి దోచేసిన కేటుగాళ్లు
డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధజంటను నిలువునా ముంచేశారు సైబర్ నేరగాళ్లు. డిజిటల్ అరెస్ట్ కారణంగా ఎన్నారై డాక్టర్ దంపతులు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నదంతా పోగొట్టుకుని, ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. సైబర్ కేటుగాళ్లు వృద్ధదంపతుల పేర ఉన్నదంతా ఊడ్చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన బయటికి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ భారీ సైబర్ మోసం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 17 రోజుల పాటు స్కామర్ల నిఘాలో ఉన్న ఆ వృద్ధ దంపతులు తమ జీవితకాల సంపాదన రూ. 14.85 కోట్లను పోగొట్టుకున్నారు.
దాదాపు 48 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్న డాక్టర్ ఓం తనేజా, డాక్టర్ ఇందిరా తనేజా దంపతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ చేశారు. వీరు ఐక్యరాజ్యసమితిలో పనిచేసి రిటైర్ అయ్యారు. డిసెంబర్ 24వ తేదీన మనీలాండరింగ్, జాతీయ భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ చట్టపరమైన సంస్థల అధికారులమని చెప్పుకుంటూ సైబర్ నేరగాళ్లు ఆ వృద్ధ దంపతులకు ఫోన్ చేశారు. తమ వద్ద అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని వారిని బెదిరించారు. డిసెంబర్ 24వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు నిరంతరం వారికి వీడియో కాల్స్ చేసి అనుక్షణం నిఘా పెట్టారు. వారు బయటికి వెళ్లినా సరే.. వేరే వారికి ఫోన్ చేసినా వెంటనే వీడియో కాల్ చేసి బెదిరింపులకు గురి చేసేవారు.
మరిన్ని వీడియోల కోసం :
